ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో రైలు పట్టాలపై సంభవించిన మృత్యుఘోషలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 278 మంది దుర్మరణం చెందినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది గాయపడగా.. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు 1200 మంది సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దీంతో... అన్ని వేళ్లూ రైల్వే మంత్రివైపు చూపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక డిమాండ్ తెరపైకి వస్తుంది!
ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదంపై విపక్షాలు సహా నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశచరిత్రలో ఇది అతిపెద్ద ప్రమాధంగా కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే... ఇంత పెద్ద ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని, అందుకు ప్రతిగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. రైల్లేల్లో సంస్కరణలు తీసుకొస్తున్నామని, ఇక ప్రమాదాలే ఉండవంటూ ఇంతకాలం గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఈ ప్రమాధంపై బాధ్యత తీసుకోవాలని అంటున్నారు.
ఇదే విషయంలో కవచ్ టెక్నాలజీ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ టెక్నాలజీని అమలుచేయడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలభించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా కవచ్ గురించి చెప్తూ తమ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తిన రైల్వే మంత్రి, నేడు ఏ సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. తాజా రైల్వే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదే సమయంలో దేశంలో ఎక్కడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరిగినా అక్కడికి వెళ్లి జెండా ఊపే మోడీ, ఒడిశా ప్రమాదంపై మాత్రం రెగ్యులర్ ప్రకటన ఒకటి చేసి ఊరుకున్నారని మండిపడుతున్నారు. ఈ సందర్భంగా తమ హయాంలో జరిగిన రైలు ప్రమాధాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజినామాలు చేసిన గత రైల్వే మంత్రుల వివరాలను తెరపైకి తెస్తున్నారు నెటిజన్లు.
ఇందులో భాగంగా... 1956లో తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 150 మంది ప్రయాణికులు మృతి చెందారు. దీంతో వారి మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ... అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజినామా చేశారు. అదేవిధంగా... 1999లో పశ్చిమ బెంగాల్ లోని గైసల్ రిమోట్ స్టేషన్ లో ప్రమాధం జరిగింది. ఈ ప్రమాధంలో అధికారిక లెక్కల ప్రకారం 285 మంది మరణించగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాధానికి బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి నితీష్ కుమార్ రాజినామా చేశారు. ఈ విషయాలను గుర్తుచేస్తూ... రైల్వే మంత్రికి రీట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఈ నేపథ్యంలో ఒడిశాలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఆయన.. ముమ్మరంగా సహాయకచర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపిన ఆయన... ప్రస్తుతం సహాయకచర్యలపై పూర్తిగా దృష్టి సారించామని, ఘటనాస్థలిలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.