జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు నుంచి పేరు తీసేయాలంటున్న ఎమ్మెల్యే పుత్రరత్నం

Update: 2022-11-10 06:31 GMT
రెండు తెలుగురాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు ఉదంతం గురించి తెలిసిందే. పబ్ కు వచ్చిన మైనర్ బాలికను మాయ మాటలుచెప్పి.. దగ్గర్లోని బేకరీకి తీసుకెళ్లి స్పెషల్ ఐటెమ్స్ తిందామని చెప్పి తీసుకెళ్లి.. మార్గమధ్యంలో గ్యాంగ్ రేప్ నకు పాల్పడటం..

ఈ ఉదంతంలో హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే కుమారుడి పేరు ఉండటం సంచలనంగా మారింది. అదే సమయంలో హైదరాబాద్ శివారుకు చెందిన టీఆర్ఎస్ నేత కొడుకు కూడా ఈ దారుణ ఉదంతంలో ఉన్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే.

ఈ కేసు నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగినట్లుగా ఆరోపనలు ఉన్నప్పటికి.. మీడియా ఈ ఉదంతం గురించి ఇచ్చిన కవరేజ్.. రెగ్యులర్ గా ఇచ్చిన ఫాలో అప్ నేపథ్యంలో తప్పించుకునే ఛాన్సు మిస్ అయ్యింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ కేసులో నిందితుడైన మైనర్ బాలుడు.. ఒక ఎమ్మ్యేల్యే కొడుకు తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పిటిషన్ ను జువెనైల్ జస్టిస్ బోర్డును అభ్యర్థించారు.

ఈ కేసులో తన ప్రమేయం లేదని.. అందుకే నిందితుల జాబితా నుంచి పేరు తీసేయాలనికోరారు. ఈ వాదనను తప్పు పడుతూ.. ఈ ఉదంతంలో మిగిలిన నిందితులతో కలిసి సదరు నిందితుడు కూడాఉన్నాడని పేర్కొన్నారు. అంతేకాదు..

నేరం జరిగినట్లుగా చెబుతున్న కారులోనూ నిందితుడు ప్రయాణించాడని.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లుగా పోలీసులు జువెనైల్ బోర్డుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు పెట్టుకున్న పిటిషన్ ను రిజెక్టు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News