చంద్రబాబుకు షాకిస్తున్న మనవడు

Update: 2016-07-01 10:23 GMT
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కొత్త సమస్య వచ్చిపడింది. ప్రపంచమంతటికీ తాను తెలుసుననే చెప్పుకొనే చంద్రబాబు నాయుడుని ఆయన సొంత మనవడే గుర్తుపట్టలేకపోతున్నాడట. అవును.. చంద్రబాబు మనవడు దేవాన్ష్ తన తాతను చూసి ఆమడ దూరం పారిపోతున్నాడట. ఎవరో గుర్తు పట్టలేకపోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు తనయుడు - దేవాన్ష్ తండ్రి అయిన లోకేశే చెబుతున్నారు. రాష్ట్రం కోసం తన తండ్రి చంద్రబాబు రాత్రనక - పగలనక కష్టపడుతూ ఇంటికి కూడా సరిగా రావడం లేదని.. దీంతో తన కుమారుడు దేవాన్ష్ చంద్రబాబును ఏమాత్రం గుర్తుపట్టలేకపోతున్నాడని.. కొత్త వ్యక్తిగా భావిస్తున్నాడని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆర్థి ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాత్రింబవళ్లనే తేడా లేకుండా కష్టపడుతూ తన కుటుంబ సభ్యులకు కూడా సరైన సమయం కేటాయించలేకపోతున్నారని ఇంతకుముందు కూడా టీడీపీ నేతలు చెప్పడమే కాకుండా స్వయంగా చంద్రబాబు కూడా పలుమార్లు చెప్పారు. వేకువనే కార్యాలయానికి వెళుతున్న ఆయన అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఇంటికి రావట్లేదట. దీంతో ఆయన కేవలం నిద్రపోవడానికి మాత్రమే ఇంటికొస్తున్నారని.. తన కుమారుడు నిద్ర  లేవడానికి ముందే ఆయన వెళ్లిపోతున్నారని... మళ్లీ ఆయన ఇంటికొచ్చేసరికి తన కుమారుడు నిద్రపోతున్నాడని లోకేశ్ చెబుతున్నారు. ఈ కారణంగా చంద్రబాబు ఎవరో దేవాన్ష్ కు తెలియడం లేదని లోకేశ్ అన్నారు.  

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెకు నిన్న వెళ్లిన లోకేశ్ కొద్దిసేపటి క్రితం అక్కడికి సమీపంలోని రామచంద్రాపురంలో మహానాడు భోజన కమిటీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరై అక్కడ ఈ విషయాలన్నీ ఆయన ముచ్చటించారు. రాష్ట్రం కోసం తన తండ్రి పడుతున్న కష్టాన్ని లోకేశ్ అక్కడ ఏకరువు పెట్టారు. తన కొడుకు నారా దేవాన్ష్ తన తండ్రిని చూసి... కొత్త వ్యక్తిని చూసినట్లు ఏడుస్తున్నాడని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మనవడిని ముద్దులాడే తీరిక లేకుండా తన తండ్రి కష్టపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News