ఐపీఎల్ క్రీడాభిమానులకు వినోదం పంచడమే కాదు. ఎందరో నాణ్యమైన క్రికెటర్లను కూడా టీమిండియాకు అందిస్తోంది. ఐపీఎల్ లో రాణిస్తున్న ఇందులో క్రికెటర్లు పేరు, డబ్బు సంపాదించుకోవడమే కాకుండా టీమిండియాలో స్థానం కూడా పొందుతున్నారు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బుమ్రా, పంత్, మయాంక్, మనీశ్ పాండే, జయదేవ్ ఉనాద్కత్, విజయ్ శంకర్ వంటి వారు ఐపీఎల్ లో విజయం సాధించి టీమిండియా తలుపులు తడుతున్నారు. భువనేశ్వర్ వంటి వారు ఐపీఎల్ ను ఉపయోగించుకొని ఎంతో రాటు దేలారు. ఐపీఎల్ లో ఒక్క ఇన్నింగ్స్ బాగా ఆడితే చాలు వాళ్ళ లైఫ్ మారి పోతుంది.
ఇప్పుడు మరో క్రికెటర్ ఐపీఎల్ లో మెరిసి ఆర్ సి బిజట్టుకు విజయాన్ని అందించాడు. అతడే కేరళ క్రికెటర్ దేవదత్ పాడిక్కల్. కేవలం ఒక్క ఇన్నింగ్స్ అతడిని హీరో చేసింది. విజయాల కోసం కొన్ని సీజన్లుగా ఎదురు చూస్తున్న బెంగుళూరు బెంగ తీర్చుతూ విజయాన్ని అందించాడు.గత ఏడాదే ఆర్ సి బి పాడిక్కల్ ను జట్టు లోకి తీసుకున్నా అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. ఈ సీజన్లో అరంగేట్ర మ్యాచ్ లోనే పాడిక్కల్ ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. సన్ రైజర్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. అలాగే బెంగళూరు జట్టుకు మొదటి నుంచి ఓపెనింగ్ సమస్య ఉంది. ఈ సారి ఆరోన్ పించ్ తో కలసి పాడిక్కల్ ఓపెనర్ గా దిగి తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించడంతో ఆర్ సి బికి ఓపెనింగ్ సమస్య తీరినట్లుగానే ఉంది. 20 ఏళ్ల పాడిక్కల్ స్ట్రైక్ రేట్ కూడా 140 కి పైగా ఉండటంతో మున్ముందు ఎలా రాణిస్తాడా అని అంతా చూస్తున్నారు.