ఏపీలో అభివృద్ధి లేదు అన్నది జనం మాట. సగటు ప్రజానీకంలో ఈ విషయం మీదనే చర్చ సాగుతోంది. మొదట్లో సంక్షేమం మీద మోజుతో అంతా పెద్ద ఎత్తున మాట్లాడుకున్నా కాలం గడుస్తున్న కొద్దీ అభివృద్ధి విలువ అందరికీ తెలిసి వస్తోంది. ఈ రోజుల్లో నిరక్షరాస్యుడు ఎవరూ లేరు. పైగా సోషల్ మీడియా యుగం ఇది. అన్నీ ఇట్టే తెలిసిపోతున్నాయి. దాంతో ప్రగతి కావాలీ అన్నదే జనం నినాదం అయితే జగన్ సర్కార్ కి మైనస్ మార్కులే వస్తాయి.
దాంతో దాని మీద జనాలకు ఎలా చెప్పుకోవాలీ అంటే అది కష్టమైన విషయమే. కరోనా అని అదనీ ఇదనీ, కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, విభజన కష్టాలనీ ఏకరువు పెడితే బొత్తిగా మెదళ్ళకు అర్ధం కానీ బ్రహ్మ పదార్ధం అవుతుంది. పైగా ఆ గొడవ మాకెందుకయ్యా సామీ అనేస్తారు. మరో వైపు ఏపీకి రెవిన్యూ లోటు ఉందని, పెద్ద ఎత్తున రెవిన్యూ వచ్చే నగరాలు లేవని చెప్పినా అంతగా నప్పదు, ఎవరూ ఒప్పరు.
మరి జనాలను కన్విన్స్ చేయాలీ అంటే ఏం చేయాలీ. జనంలో చర్చకు పెట్టే అతి కీలకమైన అంశంగా అది ఉండాలి. ఉద్యోగుల ఆందోళన వేళ ఆ చర్చకు ఆస్కారం ఏర్పడుతోందా అంటే ఎవరూ కాదనలేని విషయమే. పైగా కామన్ మాన్ కి ఎపుడూ ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒక యాంటీ భావన ఉంటుంది. ఇక కరోనా కాలం వచ్చేసి ఉన్న ఉద్యోగాలు ఊడి ఫుడ్ కి లాటరీ కొడుతున్న బాపతు జనాలు పెరిగిపోయాక చిరుద్యోగులు, నిరుద్యోగులు అంతా గుర్రుమంటోంది సర్కార్ వారి కొలువుల్లో ధిలాసాగా కూర్చున్న వేతన జీవుల మీదనే.
అందరికీ కరోనా వేళ కాలినా హ్యాపీగా ఉన్నది మాత్రం ప్రభుత్వ ఉద్యోగులే అన్న అభిప్రాయం అయితే జనాల్లో ఉంది. పైగా రెండేళ్ళుగా లాక్ డౌన్లు, కరోనా ఆంక్షలు అనీ అవనీ ఇవనీ లోకం నడిచిందే తక్కువ. దాంతో పెద్దగా పని లేక ఇళ్ళలో ఖాళీగా ఉంటున్నా కూడా పైసా పొల్లుపోకుండా సంపాదిస్తున్నది గవర్నమెంట్ ఎంప్లాయీసే అని కూడా అన్న భావన ఒకటి ఉంది.
సరిగ్గా ఈ టైమ్ లోనే ఉద్యోగులు రొడ్డెక్కుతున్నారు. దాంతో ప్రభుత్వానికి ఒక పని సులువు అవుతోంది అంటున్నారు. అదేంటి అంటే అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నారు అన్న దానికి జవాబు కూడా దీని నుంచే చెప్పే వీలూ సాలూ అలా కుదురోందిట. ఖజానాకు వస్తున్న ప్రతీ పైసాలో నూటికి ఎనభై శాతానికి పైగా ఉద్యోగుల జీతాలకు పోతున్నాయని అందుకే అంకెలతో సహా వైసీపీ నేతలు వివరించే ప్రయత్నం చేస్తున్నారుట.
ఆ విధంగా చేయడం వల్ల అభివృద్ధి ఎందుకు ఆగింది అంటే అన్ని వేళ్ళూ ఇపుడు సర్కార్ మీదకు వెళ్లకుండా ఉద్యోగుల మీదకే వెళ్తాయి అన్న లాజిక్కు కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి ఉద్యోగులు మంచికో చెడ్డకో పీయార్సీ మీద ఉద్యమాలు చేసి తీరా అది వచ్చకా నచ్చడంలేదని ఆందోళన బాటన పడుతున్నారు. ఇపుడు వారి విషయంలో వాస్తవాలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూనే సంక్షేమానికి అభివృద్ధికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్నను జనాల్లోకి చొప్పించే విధంగా వైసీపీ నేతలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఇది కనుక జనాల్లోకి బాగా వెళ్తే అక్కడ వైసీపీ హిట్ అయినట్లే. ఇంతకీ అభివృద్ధి లేకపోవడానికి ఏపీలో ప్రగతి గతి తప్పడానికి కారకులు ఎవరు.. పాపాల భైరవులు ఉద్యోగులు అవుతారా.. ఏమో.. జనాల మెదళ్ళలోకి ఏది బాగా ఎక్కుతుందో దాన్ని బట్టే చూడాలంటున్నారు.