బొద్దుగా ఉండటం ముద్దు కాదని ప్రముఖులు డిసైడ్ అయినట్లున్నారు. భారీగా ఉండే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ స్లిమ్ కావటం పలువురు ప్రముఖుల్లో స్లిమ్ నెస్ మీద మోజు పెంచినట్లుగా కనిపిస్తోంది. భారీకాయంగా లేకున్నా.. కాస్త బొద్దుగా కనిపించే మహరాష్ట్ర ముఖ్యమంత్రికి స్లిమ్ కావాలన్న ఆలోచన వచ్చిందట.
అనుకున్నదే తడువుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం స్లిమ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలెట్టారట. గడిచిన మూడు నెలలుగా ఆయనీ ప్రయత్నంలో బిజీబిజీగా ఉన్నారట. సన్నబడటం మీద దృష్టి పెట్టిన ఆయన మూడు నెలల వ్యవధిలో ఏకంగా 18 కిలోలు తగ్గటం విశేషం. తాజాగా ఆయన స్లిమ్ అయిన తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫడ్నవిస్ స్లిమ్ నెస్ ను స్ఫూర్తిగా తీసుకుంటే.. రాజకీయ నేతల షేపుల్లో చాలానే మార్పు రానున్నదన్న మాట. మరి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమందికి స్ఫూర్తిగా నిలుస్తారో చూడాలి.