ప్రభుత్వాధినేతపై విపక్ష నేతలు విమర్శలతో విరుచుకుపడటం మామూలే. అయితే.. సొంత పార్టీ నేతలే అధినేత మీద అక్కసు వెళ్లగక్కిన విచిత్రమైన పరిస్థితి ఉత్తరప్రదేశ్ లో నెలకొంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే యుద్ధ ప్రాతిపదికను స్పందిస్తూ.. వారికి సాయం చేస్తూ వార్తల్లోకి వస్తున్న అఖిలేశ్ యాదవ్ పై ఆయ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు తిట్ల దండకం అందుకున్నారు. పనికిమాలిన ముఖ్యమంత్రి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర చరిత్రలో ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రి తాను చూడలేదని.. ఆయన్ను వెంటనే మార్చేసి అనుభవం ఉన్న కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని.. లేదంటే పార్టీ మనుగడకే ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత దారుణంగా ముఖ్యమంత్రి మీద విమర్శల దాడికి దిగింది.. అదే పార్టీకే చెందిన ఎమ్మెల్సీ.. దేవేంద్ర ప్రతాప్ సింగ్.
అఖిలేశ్ ఏమీ మామూలు ముఖ్యమంత్రి కాదు. యంగ్ అండ్ ఎనర్జటిక్ అన్న బిరుదులతో పాటు.. టెక్కీ సీఎంగా ఆయనకు పేర్లున్నాయి. అయితే.. ఇన్ని గుణాలు ఉన్నా.. సమర్థత విషయంలో ఆయనపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. విపక్షాలు తిట్టటం ఒక ఎత్తు అయితే.. సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్సీ ఒకరు ఈ రేంజ్‌లో తిట్ల దండకం తిట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. సమాజ్ వాదీ పార్టీ అధినేతగా ఉన్న ములాయం కుమారుడైన అఖిలేవ్ పై ఇంతలా చెలరేగిపోవటం.. అఖిలేశ్ వర్గానికి మింగుడుపడని వ్యవహారంగా మారింది.
అయితే.. సంచలన వ్యాఖ్యలు చేయటం ఎమ్మెల్సీ కొత్త కాదు. ఆ మధ్యన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసే సంస్థలన్నింటలోనూ అవినీతి పెరిగిపోయిందని.. గడిచిన రెండేళ్లలో చేపట్టిన అన్ని నియామకాలపైనా సీబీఐ విచారణ చేయించాలంటూ ప్రధాని మోడీకి లేఖ రాసి కలకలం రేపారు.
ముఖ్యమంత్రి మీద పార్టీ నేతే ఇంతలా చెలరేగిపోతున్న వైనంపై యూపీ సమాజ్ వాదీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల నుంచి పని చేస్తున్న అఖిలేష్ యాదవ్ గుర్తింపు కోసం కిందామీదా పడుతున్నారని.. యూపీ చరిత్రలో అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రిగా అఖిలేశ్ మిగిలిపోతారని దేవేంద్ర మండిపడటంతో పార్టీ పరపతి దారుణంగా దెబ్బ తినటం ఖాయమని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి మీదనే ఈ స్థాయి విమర్శలు చేసిన దేవేంద్రపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.