చిచ్చు రేగింది. మరో ఆందోళనకు తెలంగాణ సమాజం సమాయుత్తమవుతోంది. తమకు జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తి చాటాలని తెలంగాణ అధికారపక్షం భావిస్తోంది. హైదరాబాద్ మొత్తంగా తమదేనని భావిస్తున్న నేపథ్యంలో.. విభజన చట్టంలోని సెక్షన్ 8 అంటూ ఏపీ సర్కారు తెరపైకి తీసుకొచ్చిన వాదనను బలంగా తిప్పి కొట్టాలని భావిస్తోంది.
సెక్షన్ 8 విషయంలో అటార్నీ జనరల్ స్పందించిన తీరుపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కారు తమ వ్యతిరేకతను వ్యక్తం చేయటం తెలిసిందే. తాజాగా వారికి ఉద్యమ సంఘాలు.. ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సెక్షన్ 8 అంశంపై మరో అడుగు ముందుకు పడకుండా ఉండేలా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.
బుధవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని.. తెలంగాణ బంద్‌కు ముఖ్యమంత్రి పిలుపు ఇవ్వాలంటూ దేవీప్రసాద్ కోరుతున్నారు. సెక్షన్ 8 అంశంపై అత్యవసరంగా సమావేశమైన టీఎన్జీవో చర్చించటమే కాదు.. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించాలని కోరుతున్నాయి. మొత్తంగా చూస్తే సెక్షన్ 8 వ్యవహారంపై అటార్నీ జనరల్ చేశారని చెబుతున్న వ్యాఖ్యలు కొత్త చిచ్చు రేపాయన్న భావన వ్యక్తమవుతోంది.