తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలు చూసినప్పుడు.. తెలంగాణలోని ఉద్యోగాల్ని ఆంధ్రోళ్లు ఆక్రమించేశారని.. వారి కారణంగా తమ ప్రయోజనాలు భారీగా దెబ్బ తిన్నాయని వ్యాఖ్యానించేవారు. అదే సమయంలో ఏపీ క్యాడర్‌లో తెలంగాణ ఉద్యోగులు పెద్దగా లేదన్నట్లుగా మాట్లాడేవారు. విభజన తర్వాత కూడా తెలంగాణలో ఏపీ ఉద్యోగులు తిష్ట వేసుకున్నారన్న వ్యాఖ్యలు భారీగా వినిపించేవి.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల్లో ఒకరైన దేవీ ప్రసాద్‌లాంటి వారి మాటలు విన్నప్పుడు ఏపీ ఉద్యోగులు టీ ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బ తీస్తున్నారన్న భావన కలగటం ఖాయం. అంతేకాదు.. వెనువెంటనే తెలంగాణలో పని చేసే ఉద్యోగులు ఏపీ క్యాడర్‌లోకి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించేవారు. రాష్ట్రం విడిపోయినా.. ఏపీ ఉద్యోగులు తెలంగాణ క్యాడర్‌ని విడిచిపెట్టటం లేదన్న వాదనలు జోరుగా వినిపించేవి.
అయితే.. ఏపీ క్యాడర్ నుంచి వెళ్లిపోవటానికి తెలంగాణ ఉద్యోగులు అస్సలు ఇష్టపడటం లేదంటూ ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్‌బాబు ఒక వాదనను వినిపించేవారు. ఆయన మాటల్ని విశ్వాసంలోకి తీసుకునే వారు కాదు. ఆయన వాదన ప్రకారం.. టీ ఉద్యోగులు ఏపీ క్యాడర్‌లో ఉన్నారని.. వారంతా ఏపీ క్యాడర్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారని.. వారందరిని తెలంగాణకు పంపేయాలని చెప్పేవారు.
అంతేకాదు.. ఏపీ క్యాడర్‌లో పని చేసే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు అందించే ప్రయోజనాలు ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు. ఆయన ఇంత కరాఖండిగా వ్యాఖ్యలు చేస్తుంటే.. ఏపీ క్యాడర్‌లోని తెలంగాణ ఉద్యోగులు ఉన్నారా? అన్న సందేహం కలిగే పరిస్థితి. అయినా.. నీళ్తు.. నిధులు. .నియమకాలే తెలంగాణ ఉద్యమానికి కారణమైనప్పుడు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు పని చేస్తారా? అన్న సందేహం రాక మానదు.
తాజాగా తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఒకరైన దేవీప్రసాద్ మాటలు విన్నప్పుడు ఆశోక్‌బాబుమాట అక్షర సత్యమన్న విషయం అర్థమవుతుంది. ఏపీలో పని చేసే తెలంగాణ క్యాడర్ ఉద్యోగులకు ఏపీ సర్కారు అమలు చేసే పదవీ విరమణ వయసు 60కి పెంచకూడదన్న డిమాండ్‌ను దేవీ ప్రసాద్ తప్పు పడుతున్నారు. ఏపీ క్యాడర్‌లో పని చేసే తెలంగాణ వారికి ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఎలా ఇవ్వరని వాదిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో.. తెలంగాణ క్యాడర్ వారంతా ఏపీకి వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉన్నారంటూ గతంలో చెప్పిన మాటల ప్రకారం.. ఏపీ అందించే ప్రయోజనాల గురించి అంతగా అడగాల్సిన అవసరం ఏమిటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాన్లో అత్యంత ముఖ్యమైన ఇష్యూలో సర్దుబాటు మాటలు ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. ఇవాళ కాకుంటే రేపు అయినా..తెలంగాణ క్యాడర్ ఉద్యోగులంతా తెలంగాణకు వెళ్లిపోవాలన్న తలంపుతో ఉన్నారంటూ చెప్పే మాటలు నిజమైన పక్షంలో.. ఏపీలో ఉన్న తెలగాణ ఉద్యోగులకు ఆ రాష్ట్రం అమలు చేసే అన్నీ సదుపాయాలు అమలు చేయాలని డిమాండ్ చేయటంలో అర్థం ఏమిటో..? దేవీప్రసాద్ వివరంగా చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
విభజన నేపథ్యంలో మా ఇంటికి మేం వెళ్లిపోతామంటూ గతంలో మాట్లాడిన వారంతా.. ఇప్పుడు ఆ అంశం మీద దృష్టి పెట్టకుండా.. ఏపీ సర్కారు ఇచ్చే ప్రయోజనాల గురించి వాదులాటకు దిగటం ఎందుకో..?