ఏపీ ఫైర్ బ్రాండ్ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు సుపరిచితులు. ఇరిగేషన్ మంత్రిగా ఆయన కీలక స్థానంలో ఉండటమే కాదు.. ప్రాజెక్టుల విషయంలో ఏపీ వాదనను డిల్లీ స్థాయిలో సమర్థవంతంగా వాదించటం పలువురు దృష్టిని ఆకర్షించింది. ఈ మధ్యన జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రి దేవినేని సమర్థత గురించి ప్రశంసించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జల వివాదం విషయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని తెర మీదకు తీసుకురావటంతో పాటు.. తాము చేస్తున్న వాదనను బలంగా తిప్పి కొడుతున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై కౌంటర్ ఎటాక్ చేయటంలో దేవినేని దూకుడు ఏపీ వాసుల్నిసంతోషానికి గురి చేసిందనే చెప్పాలి.
దేవినేనికి సంబంధించి మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఆయన చాలా మొండిఘటం. ఎంత మొండి అంటే.. రాష్ట్ర విభజన తర్వాత మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక.. తన శాఖను చూసుకునేందుకు హైదరాబాద్ రావటానికి ఆయన సుతారం ఇష్టపడలేదు. ఏపీ ముఖ్యమంత్రి ఏపీకి వెళ్లక ముందే.. ఆయన తన కార్యాలయాన్ని బెజవాడలో ఏర్పాటు చేశారు. ఏపీ మంత్రి వర్గంలో ఎవరూ దేవినేనిలా వ్యవహరించలేదు. తాను ఏపీ మంత్రినని.. ఏపీలోనే ఉంటానని.. హైదరాబాద్ వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పటమే కాదు.. రివ్యూల కోసం అధికారుల్ని విజయవాడకు పిలిపించుకునే వారే తప్పించి.. హైదరాబాద్ కు వెళ్లేందుకు ఇష్టపడే వారు కాదు.
ఏపీకి తరలివెళ్లటం ఈ రోజు ఈ స్థాయిలో జరిగినా.. దీనికి అద్యుడు దేవినేని అని చెప్పకతప్పదు. తాజాగా ఇరిగేషన్ శాఖ బెజవాడకు వచ్చిన సందర్భంగా ఉద్యోగుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తాను చేసిన త్యాగం లాంటి పని గురించి ఆయన చెప్పటం అందరి దృష్టిని ఆకర్షించింది.
రాష్ట్ర విబజన నేపథ్యంలో మనది కాని రాష్ట్రంలో ఉండకూడదంటూ విజయవాడకు వచ్చేశానని చెప్పిన ఆయన.. ‘‘ఇక్కడే ఉంటే కార్యకర్తలకు.. రైతులకు అందుబాటులో ఉండే వీలుంది. నేను అనుకుంటే హైదరాబాద్ లో పెద్ద బంగ్లాలోనే ఉండొచ్చు. కానీ.. డబుల్ బెడ్రూం ఇంట్లోనే ఉన్నా. రెండు రూములున్న కార్యాలయం నుంచే పనులు చేశా. ఆఫీసు లేక.. బస్సులోనే ఉంటున్న ముఖ్యమంత్రికి నా ఆఫీస్ ఇచ్చేశా. దీంతో..నాకంటూ ఆఫీస్ అంటూ లేకుండా పోయింది. నన్ను కలవటానికి వచ్చే వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలీని పరిస్థితి. అందుకే.. ఉదయం ఎనిమిది గంటలకే పొలం గట్ల వెంట తిరిగా. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ.. ఉద్యోగులకు మాత్రం సకల సౌకర్యాలు కల్పించిన తర్వాతనే తరలిస్తున్నాం. అనుకున్న విధంగా ఉద్యోగులంతా వస్తుంటే సందడి వాతావరణం నెలకొంది. ఇది చాలా బాగుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. తన స్పీచ్ లో తాను చేసిన త్యాగం గురించి మాత్రమే కాదు.. ఉద్యోగులకు చక్కటి సౌకర్యాల కోసం సీఎం చంద్రబాబు ఎంత కష్టపడ్డారన్న విషయాన్ని చెప్పేయటం గమనార్హం.