ధోని మరోసారి తండ్రి కాబోతున్నాడట.. బయటపెట్టిన రైనా భార్య

Update: 2021-10-16 12:00 GMT
చెన్నై సూపర్ కింగ్స్ కు మరోసారి ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తండ్రి కాబోతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని సురేశ్ రైనా భార్య ప్రియాంక అధికారికంగా ధ్రువీకరిస్తూ బయటపెట్టడం విశేషం. 2022లో సాక్షి బిడ్డను ప్రసవించబోతున్నట్టు తెలిపింది.

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిసింది. ఐపీఎల్ లో సీఎస్కేను నాలుగోసారి టైటిల్ విజేతగా నిలిపిన ధోని సత్తా చాటాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో శుక్రవారం రాత్రి దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నైని విజయవంతంగా ముందుకు నడిపించాడు. బ్యాటింగ్,బౌలింగ్, ఫీల్డింగ్ లో చెన్నై సత్తా చాటింది. 27 పరుగుల తేడాతో కోల్ కతాను ఓడించింది.

ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనితో కలిసి మైదానంలో అతడి భార్య సాక్షి, కూతురు జీవా కాసేపు సందడి చేశారు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలవగానే మైదానంలోకి వచ్చిన సాక్షి, జీవా.. ఆనందంతో ధోనిని హత్తుకున్నారు. ఆసమయంలో సాక్షి వేసుకున్న డ్రెస్ ఆధారంగా ఆమె మళ్లీ గర్భవతి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. దాంతో స్పందించిన సురేశ్ రైనా భార్య ప్రియాంక.. 2022లో సాక్షి మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు వెల్లడించింది.

ధోని ఫ్యామిలీతో సురేశ్ రైనా దంపతులకు మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్.  2015లో జీవా పుట్టిన న్యూస్ మొదట రైనాకే సాక్షి చెప్పి ధోనికి చెప్పమనేంతలా దగ్గరి అనుబంధం ఉంది. ఇప్పటికే ఒక ఆడబిడ్డను కన్న ధోని ఈసారి అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిసింది. 2022 నాటికి జూనియర్ ధోని రాబోతున్నారంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

2010 జులై 4వ తేదీన ఎంఎస్ ధోని.. సాక్షిని పెళ్లి చేసుకున్నాడు. 2015 ఫిబ్రవరి 6న జీవా జన్మించింది. 2020 ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన ధోని  ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్నాడు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు  టీ20 వరల్డ్ కప్ లోనూ టీమిండియా మెంటర్ గా ధోని వ్యవహరించబోతున్నాడు.
Tags:    

Similar News