ధోనీని అందరూ మిస్టర్ కూల్ అంటుంటారు. మైదానంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా చాలా ప్రశాంతంగా ఉంటాడని అతడికి ఆ పేరు వచ్చింది. ఐతే గ్రౌండ్లో ఏం జరిగినా అంత కూల్ గా ఉండే ధోనీకి కూడా కోపం తెప్పించేశారు మీడియా వాళ్లు. నిన్న బంగ్లాదేశ్ తో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐతే భారత్ గెలిచింది కదా అని సంతోషకరమైన ప్రశ్నలు వేయకుండా.. ఓ విలేకరి ధోనీకి మంట పుట్టించే ఓ క్వశ్చన్ వేశాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా ఆ విలేకరి ‘‘మ్యాచ్‌కి ముందు, నెట్ రన్ రేట్ పెంచుకునేలా బంగ్లాదేశ్ మీద భారీ విజయం సాధిస్తారని అంతా అనుకున్నారు. కానీ అతి కష్టమ్మీద గెలవగలిగాం. ఈ విజయంతో మీరు ఎంతవరకు సంతృప్తి చెందుతున్నారు?’’ అని ప్రశ్నించాడు. దీనికి ధోనికి కోపంగా.. ‘‘ఇండియా గెలవడం పట్ల మీరు సంతోషంగా లేనట్లున్నారు. మీ గొంతును, మీ ప్రశ్నను బట్టి చూస్తుంటే టీమ్ ఇండియా గెలిచినందుకు మీరు ఏమాత్రం ఆనందంగా లేనట్లు నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఓ మ్యాచ్ గెలవడానికి ఓ స్క్రిప్ట్ అంటూ ఏమీ ఉండదు. టాస్ ఓడిపోయిన తర్వాత ఆ వికెట్ మీద మేం ఎందుకు పరుగులు చేయలేకపోయామో విశ్లేషించాలి. మీరు బయట కూర్చుని కూడా ఈ విషయాలను విశ్లేషించలేకపోయినప్పుడు ఈ ప్రశ్న అడగకూడదు’’ అని బదులిచ్చాడు ధోని. ఎప్పుడూ కూల్ గా ఉండే ధోని ఇలా ఆగ్రహంతో జవాబివ్వడంతో ప్రెస్ కాన్ఫరెన్స్ లో గంభీరమైన వాతావరణం నెలకొంది.
మరోవైపు మ్యాచ్ సందర్భంగా టీమ్ ఇండియాపై నెగెటివ్ కామెంట్లు చేసిన వ్యాఖ్యతలపైన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విమర్శలు గుప్పించారు. ‘‘భారత కామెంటేటర్లు ఎప్పుడూ అవతలి వాళ్ల గురించే కాదు.. మన గురించి కూడా మాట్లాడాలి. అవతలి జట్టులో బ్యాట్స్ మన్ ఔటేతే తెగ బాధపడుతుంటారని.. వాళ్ల గురించే కామెంట్లు చేస్తారు. మన బౌలర్ల ప్రతిభ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బిగ్-బి.