కరోనా కల్లోలంలో సరైన చర్యలు తీసుకోవడం లేదని అధికార బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ లో జోరు పెంచారు. కోవిడ్ రెండో దశ ఉధృతి సమయంలో పార్లమెంట్ నూతన భవన నిర్మాణం, ఔషధాలు, వ్యాక్సిన్ల కొరతపై రోజుకో ట్వీట్ చేస్తూ కేంద్రంపై రాహుల్ దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్రమోడీని రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు. దేశంలో వ్యాక్సిన్లతో పాటు ప్రధాని కూడా కనిపించడం లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కరోనా ఉధృతిపై కనీసం మోడీ స్పందించడం లేదంటూ పరోక్షంగా దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ ‘వ్యాక్సిన్, ఆక్సిజన్, ఔషధాలతోపాటు ప్రధాని మోడీ కూడా కనిపించడం లేదు. కేవలం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, మందులపై జీఎస్టీ, అక్కడా.. ఇక్కడ ప్రధాని ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
-అమిత్ షా మిస్సింగ్ అని ఎన్.ఎస్.యూ.ఐ ఫిర్యాదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలియడకుండా పోయారని కాంగ్రెస్ అనుబంధం విద్యార్థి విభాగం (ఎన్.ఎస్.యూ.ఐ) తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్.ఎస్.యూ.ఐ కార్యదర్వి నగేశ్ కరియప్ప స్వయంగా కరోనా మహమ్మారి గుప్పిట్లో దేశం చిక్కుకుపోయిందని.. ప్రజలు సంక్షోభంలో ఉన్నారని.. ఇలాంటి తరుణంలో అమిత్ షా కనిపించకుండా పోయారని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాలని.. కానీ సంక్షోభ సమయంలో ఇలా పలాయనం చిత్తగించడం ఏంటని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరిసారిగా అమిత్ షా బెంగాల్ ప్రచారంలో కనిపించారని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు.