కేసుల్ని ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరఫున తాజా విచారణలో జగన్ తరఫు న్యాయవాది కోర్టులో కీలక అంశాన్ని ప్రస్తావించారు. జగతి పబ్లికేషన్స్ కు సంబంధించిన వాల్యూయేషన్ నివేదికను తప్పుడు పత్రాల్ని తీసుకొచ్చారని ఆరోపించారు. డెలాయిట్ నివేదికలో పొందుపరిచిన అంశాల్లో వాస్తవాల్ని ధ్రువీకరించే పేరుతో ఎస్ బీఐ నుంచి తప్పుడు నివేదికలు తెప్పించినట్లుగా పేర్కొన్నారు.
జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఎ1గా వ్యవహరించిన వైఎస్ జగన్ డిశ్చార్జి పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎస్ బీఐ క్యాపిటల్స్ నుంచి తెప్పించుకున్న నివేదికపైన సీబీఐ ఆధారపడిందన్నఆయన.. వాస్తవాల్ని విస్మరించి ఆంగ్ల పత్రికలతో పోలిక పెట్టి నివేదిక రూపొందించారన్నారు.
అభియోగపత్రంలో పేర్కొన్న సాక్ష్యులెవరూ జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ నివేదిక ఆధారంగా జగన్ కు వ్యతిరేకంగా కేసును నిరూపించలేరన్నఆయన వాదనల్ని కోర్టు విన్నది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 9కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.