కుప్పం ఎఫెక్ట్‌.. చంద్ర‌బాబు గ్రాఫ్ ర‌య్ ర‌య్‌...!

Update: 2023-01-10 06:45 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ్రాఫ్ పెరిగిందా?  ఇటీవ‌ల కుప్పంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌, ప్ర‌భుత్వ నిర్బంధాలు వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు సానుకూలత మ‌రింత పుంజుకుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. కుప్పంలో ప్ర‌భుత్వం ఆయ‌న‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం.. ఆయ‌న దానిని ఎదిరించ‌డం.. పోలీసుల‌తో వాగ్వాదం.. ద‌రిమిలా. చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగింద‌ని చెబుతున్నారు.

అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం.. చంద్ర‌బాబును నిర్బంధిస్తోంద‌నే టాక్ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింద‌ని చెబుతు న్నారు. చంద్ర‌బాబు ఇమేజ్‌ను దెబ్బ‌తీసేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. నాటి ప‌రిణామాల‌పై ఇంకా.. ప్ర‌జ‌ల్లో చ‌ర్చ న‌డుస్తోంద‌ని చెబుతున్న టీడీపీ నేత‌లు.. బాబు ఇమేజ్‌ను ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నార‌ని అంటున్నారు.

ప్ర‌ధానంగా వైసీపీ చేసిన అడ్డంకులు.. పోలీసుల దూకుడు, చంద్ర‌బాబు రోడ్డుపై కూర్చోవ‌డం వంటివి క‌లిసి వ‌చ్చాయ‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు.. ఇత‌ర పార్టీల నుంచి కూడా సానుభూతి పెరిగింద‌ని అంటున్నారు. చంద్ర‌బాబుకు ఇప్ప‌టికే జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టులు, బీజేపీ నుంచి(పార్టీకి అతీతంగా) సానుభూతి పెరిగిందనేది తెలుస్తున్న విష‌య మే.

దీనిని ఇలానే కొన‌సాగించి.. ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా పార్టీని ముందుకు న‌డిపించేందుకు వ్యూహాత్మ‌కం గా ముందుకు సాగాల‌నే చ‌ర్చ కూడా టీడీపీలో క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలావుంటే.. పార్టీల‌కు అతీతంగా చంద్ర‌బాబుకు సినీ రంగం నుంచి కూడా మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌డం విశేషం. మొత్తానికి వైసీపీ ఒక‌టి త‌లిస్తే.. చంద్ర‌బాబుకు మ‌రో రూపంలో క‌లిసి వ‌చ్చింద‌నే టాక్ టీడీపీలో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఏమేర‌కు పార్టీకి ప్ల‌స్ అవుతుందో.. ఎన్నిక‌ల స‌మయానికి ఏవిధంగా క‌లిసి వ‌స్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News