సినిమా టికెట్ల ధరల పెంపుపై జగన్ సర్కారు అనుసరిస్తున్న విధానాలు హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. ఓవైపు పరిశ్రమ వర్గాలు చేస్తున్న వినతుల్ని పక్కన పెట్టేసిన ప్రభుత్వం జీవో నెంబరు 35ను జారీ చేయటం.. సినీ రంగానికి దిమ్మ తిరిగే షాకిచ్చేలా మారింది. ఇలాంటివేళ..ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి మింగుడుపడని రీతిలో మారాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 35ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దీంతో.. పరిశ్రమ వర్గాలు సంతోష పడ్డాయి. ఇలాంటి వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు మింగుడు పడని రీతిలో మారింది. హైకోర్టు తాజా ఆదేశాలకు భిన్నంగా గుంటూరు జాయింట్ కలెక్టర్ పేరుతో ఒక కాపీ వైరల్ అవుతోంది. ఇందులో.. గుంటూరు జిల్లా పరిధిలోని అన్ని థియేటర్లలో ఏప్రిల్ 8న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 35ను అనుసరించే సినిమా ప్రదర్శనలు ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా ఒక ఉత్తర్వు కాపీ వైరల్ గా మారింది.
ఇందులో టికెట్ ధరల విషయంలో కానీ.. షోలను ప్రదర్శించే విషయంలో కానీ నిబంధనల్ని అతిక్రమిస్తే.. థియేటర్లను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. అంతేకాదు.. సినిమాటోగ్రఫీ చట్టం కింద భారీ ఫైన్ విధిస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు వెలువడిన రోజే (మంగళవారం) ఈ సర్క్యులర్ విడుదలైనట్లుగా ఒక కాపీ సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. నిజంగానే గుంటూరు జాయింట్ కలెక్టర్ ఈ ప్రకటన విడుదల చేశారా? లేదంటే ఫేక్ ప్రకటన వైరల్ అవుతుందా? అన్నది తేలాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఒక జిల్లా జేసీ ఇలాంటి ప్రకటన విడుదల చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హైకోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకుంటున్న చిత్ర పరిశ్రమకు గుంటూరు జేసీ పేరుతో విడుదలైన ఉత్తర్వులు నిజమైతే.. షాక్ తగిలినట్లే. అయినా.. ఒక జిల్లా జేసీ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేస్తారా? ఇలాంటివి అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలే తప్పించి.. ఒక జిల్లాలో చేసి.. మరో జిల్లాలో చేయకుండా ఉంటారా? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ.. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఈ ఉత్తర్వు విడుదలై ఉంటే.. మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.