అమెరికాకు భారత్ సరైన సమాధానమే చెప్పిందా?

Update: 2022-04-15 15:30 GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తుతం భారత్ కు ఇబ్బందిగా మారుతోంది. కొన్ని దేశాలు ఉక్రెయిన్ కు ఇంకొన్ని దేశాలు రష్యాకు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో భారత్ వైఖరిపై వివిధ కోణాల్లో ప్రశ్నలు వస్తున్నాయి. భారత్ విదేశాంగ విధానం ఏమిటి? ఏ దేశానికి మద్దతు ఇస్తారు? ఏ దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తారు? అనే విషయంపై కొద్ది రోజులుగా చర్చలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇండియాది ఎప్పటికి తటస్థ విధానమే. అదే మన అలీన విధానమని చెప్పినా అమెరికా లాంటి దేశం మాత్రం విశ్వసించడం లేదు.

ఫలితంగా మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో మన విదేశాంగ విధానంపై మనవాళ్లే విమర్శలు చేసే స్థాయికి వెళుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో జరిగిన చర్చల్లో మన విదేశాంగ మంత్రి జైశంకర్, ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పేరును ప్రస్తావించకుండానే ఉక్రెయిన్ లోని బుచాలో పౌర హత్యల గురించి మాట్లాడటంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత్ వైఖరిలో మార్పు వచ్చిందని భావిస్తున్నారు.

జైశంకర్ అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘనపై కూడా మాట్లాడారు. మన అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉందని చెబుతున్నారు. తాజా పరిణామాలపై పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ వైఖరిని ప్రశంసించారు. విదేశాంగ విధానంలో ఇండియా వైఖరి సముచితమే అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో కూడా వాణిజ్య సంబంధాలు బలపడటంతో ఇండియా కూడా బలమైన దేశంగా అవతరించే అవకాశాలు ఉన్నాయి.

రష్యా, ఉక్రెయిన్ విషయంలో ఏ దేశానికి కూడా మద్దతు తెలిపడం లేదు. యుద్ధం మాత్రం మంచిది కాదని శాంతి చర్చలే శరణ్యమనే విధానాన్ని భారత్ అవలంభిస్తోంది. దీనికి ఏ దేశానికి ఎలా ఉన్నా మన దేశం విధానం మాత్రం ఒక్కటే. ఏ దేశానికి మద్దతుగా నిలవదని చెబుుతన్నా అన్ని దేశాలు మన దేశంపై ఎందుకంత దృష్టి సారిస్తున్నాయో తెలియడం లేదు.

రష్యా, అమెరికా రెండు ప్రధాన దేశాలుగా తమ విధానాలు వెల్లడి చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం రష్యాకు మద్దతుగానే నిలుస్తోంది. ఒకవేళ చైనా రష్యా ఒక్కటైతే భారత్ కు కూడా కష్టాలే ఉంటాయి. అందుకే ఇండియా రష్యాకు వ్యతిరేకంగా పనిచేయడానికి ఇష్టపడటం లేదు. అమెరికా దీన్ని అర్థం చేసుకోకుండా ఇండియా వైఖరి వెల్లడించాలని పట్టుబడుతోంది. అందుకే తటస్థ వైఖరి మన విధానమని ఎంతగా చెప్పినా పట్టించుకోవడం లేదు.

ప్రస్తుతం మోడీ అనుసరిస్తున్న విధానం సరైనదే. అలీన విధానం మన విధానం కావడంతోనే మనం అటు రష్యాకైనా ఇటు ఉక్రెయిన్ కైనా మద్దతు పలకడం లేదు. యుద్ధం ఆ రెండు దేశాల ప్రమేయం. అందులో మనం తలదూర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ దేశానికి మద్దతు పలికినా తరువాత మనకు తీవ్ర నష్టమే కలగనుంది.

ఇప్పటికే పెట్రో ఉత్పత్తుల రవాణా కోసం మనం అటు రష్యా, ఇటు అమెరికా పై ఆధారపడాల్సిన అవసరం వస్తోంది. అందుకే అప్పుడు నెహ్రూ అనుసరించిన విధానానికి పూర్తిగా విరుద్ధంగా ప్రస్తుత ప్రధాని మోడీ వైఖరి ఉంటోంది. ప్రపంచ దేశాలు ఏమనుకున్నా మన సిద్ధాంతం మాత్రం ఏ దేశం కోసం మార్చుకోమని తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి.
Tags:    

Similar News