ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూస్తే అలాగే అర్థమవుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ తో చెలిమి చేసిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యూపీఏనా..? అదెక్కడుంది..?’ అని శరద్ పవార్ తో కలిసిన సందర్భంగా అమె అలా అన్నారు. దీంతో ఆమె బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ను కాదని ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం తన పార్టీని విస్తరించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయకంగా కాంగ్రెసేతర శక్తిగా ఎదిగేందుకు మమతా, కేజ్రీవాల్ చేస్తున్న ప్రయత్నాల్లో ఎవరు విజయం సాధిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2022 సంవత్సరంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ముఖ్య నాయకులను కలుస్తున్నారు. భేటీలు, మీటింగ్ లతో హల్ చల్ చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ప్రతాపం చూపిస్తే దీనిని జాతీయ ఎన్నికల్లో వాడుకోవచ్చని మమతా ప్లాన్. ఈ నేపథ్యంలో ఆమె త్వరలోజరిగే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రీకరించారు. ఇప్పటికే గోవా రాష్ట్రంలో పర్యటించిన ఆమె అక్కడి కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఆ తరువాత త్రిపుర,ఉత్తప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి కాంగ్రెస్ నాయకులపై ఫోకస్ పెడుతున్నారు.
ఇప్పటి వరకు మమతా పార్టీలో కీర్తి ఆజాద్, అశోక్ తన్వర్, సుస్మితా దేవ్ లాంటి ముఖ్య నాయకులు చేరారు. అలాగే మేఘాలయ రాష్ట్రం నుంచి 12 మంది కాంగ్రెస్ ను వీడీ టీఎంసీలో చేరారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో ఆమె మోదీకి వ్యతిరేకంగా చేసిన పోరాట తీరుతోనే ఆమె పార్టలో చేరేందుకు ఇంట్రస్టు చూపుతున్నారు. అయితే మమతా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులనే చేర్చుకోవడం ఆసక్తిగా మారింది. మిగతా పార్టీలను కాదని ఈ పార్టీపై ఎక్కువ ఫోకస్ చేయడం కాంగ్రెసేతర శక్తిగా మార్చుకోవడంలో భాగమేనని తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ చాలా బలహీనంగా మారంది. అలాగే పుంజుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ బలపడుతుందని ప్రచారం జరుగుతున్నా అందుకు తగ్గ దూకుడు ప్రదర్శించడం లేదని అంటున్నారు. దీంతో చాలా మంది బీజేపీ నచ్చని కాంగ్రెస్ నాయకులు టీఎంసీని ఆశ్రయిస్తున్నారు. గతంలో బీజేపికి ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ ఉండేది. కానీ రాను రాను ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. ఇక పుంజుకుంటుందన్న ఆశ ఆ పార్టీ నేతల్లోకనిపించడం లేదు. దీంతో టీఎంసీని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మరోవైపు ఆప్ నేత కేజ్రీవాల్ సైతం కాంగ్రసేతర శక్తిగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టిన కేజ్రీవాల్ ఇక ఇతర రాష్ట్రాల్లోనూ జెండా ఎగురవేయడానికి తహతహలాడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన పంజాబ్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఇక్కడ కాంగ్రెస్ ను ఓడించేందుక ఆప్ కు అనుకూల పవనాలున్నాయి. అలాగే యూపీ, ఉత్తరాఖండ్,హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఆప్ పోటీకి సిద్ధమవుతోంది. కేజ్రీవాల్ సైతం కాంగ్రెస్ నేతలపై గురి పెట్టారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితిని గమనించిన కేజ్రీవాల్ ఆ పార్టీ నాయకులకు ఆశ్రయం ఇస్తున్నారు.
ఇలా రెండు ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరికి వారే కాంగ్రెసేతర శక్తిగా మారేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వాటి పరిస్థితిని భట్టి జాతీయ రాజకీయాల్లో పాగా వేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే జాతీయ రాజకీయాలకొచ్చేసరికి ఈ రెండు పార్టీలో ఒక్కటవుతాయా..? లేదా..? ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారా..? చూడాలి.