కుంబ్లేను ‘ఐసీసీ’ అవమానించిందా?

Update: 2021-06-19 02:51 GMT
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భారతీయ లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను అవమానించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ సందర్భంగా ఐసీసీ ఆవిష్కరించిన పోస్టర్ ఈ వివాదానికి కారణమైంది.

144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఇంగ్లండ్ లోని సౌంతాప్టన్ లో ఐసీసీ నిర్వహిస్తోంది. భారత్, న్యూజిలాండ్ ఈ ఫైనల్ లో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను ఐసీసీ రూపొందించింది.

ఈ పోస్టర్ లో భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు చోటు దక్కకపోవడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1998-99లో అనిల్ కుంబ్లే పాకిస్తాన్ సాధించిన 10 వికెట్ల ఫీట్ ను ఐసీసీ పరిగణలోకి తీసుకోకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.అనిల్ కుంబ్లేను అవమానించినట్టేనని విమర్శిస్తున్నారు. ఐసీసీని ట్రోల్ చేస్తున్నారు.

టెస్ట్ క్రికెట్ 1877లో మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ల మధ్య తొలి మ్యాచ్ తో మొదలైంది. నేటి డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు సేకరించిన ఫొటోలతో ఈ పోస్టర్ ను ఐసీసీ రూపొందించింది. ఇందులో దిగ్గజ ఆటగాళ్లు షేన్ వార్న్,  అండర్సన్, ముత్తయ్య మురళీధరన్, ఇమ్రాన్ ఖాన్, జాక్వెస్ కల్లిస్, సచిన్ టెండూల్కర్, స్లీవ్ వా, షకీబుల్ హసన్, విరాట్ కోహ్లీ, కేన్ విలయమ్స్ సన్ తదితర దిగ్గజాల ఫొటోలను ముద్రించింది.

ఐసీసీ మంచి ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని అరుదైన ఫీట్లను విస్మరించడం వివాదాస్పదంగా మారింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదుగా చెప్పుకునే ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్ల సాధించిన అనిల్ కుంబ్లే కు చోటు లభించకపోవడంపై భారతీయ అభిమానులు ఊగిపోతున్నారు.
Tags:    

Similar News