మరక మంచిదే అన్నది ప్రముఖ వాణిజ్య సంస్థ చెప్పే ప్రకటన మాట. అలాంటిది మేలు చేసే మార్పు మరింత మంచిది. అలా అని వ్యవస్థ మొత్తాన్ని రాత్రికి రాత్రే మార్పులు తీసుకు రావటం అంత తేలికైన విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఒక్కసారిగా మార్చేస్తూ నిర్ణయం తీసుకోవటం.. వందకు పైగా రోజులు రిజిస్ట్రేషన్లు నిలిపివేయటం తెలిసిందే. దీని కారణంగా ప్రభుత్వం పన్ను ఆదాయాన్ని కోల్పోగా.. ప్రజలు పెద్ద ఎత్తున ప్రభావానికి గురయ్యారు. అమ్మేవారికి ఒకరకమైన కష్టాలు వస్తే.. ఆస్తులు కొనే వారికి మరో తరహా సమస్యలు వచ్చిన పరిస్థితి.
దీంతో.. తెలంగాణ రాష్ట్ర సర్కారు తీరు మీదా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా వ్యతిరేకత అంతకంతకూ ఎక్కువైపోయిన పరిస్థితి. ఇలాంటివేళ.. సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంటూ.. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాల్సిందిగా ఆదేశాలుజారీ చేశారు. దీంతో.. ఇంతకాలం నీరసించిన వారు.. రిజిస్ట్రేషన్ల కోసం పరుగులు తీసిన పరిస్థితి. దీంతో.. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 2536 చేసుకోగా.. వీటి కారణంగా ప్రభుత్వానికి సుమారు రూ.71.73 కోట్ల రాబడి లభించింది.
దాదాపు మూడు నెలల అనంతరం పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లకు అనుమతించిన నేపథ్యంలో.. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సందడి నెలకొన్నాయి. అమ్మకందారులు.. కొనుగోలుదారులతో కళకళలాడాయి. తొలి జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధిక భాగం హైదరాబాద్ చుట్టుపక్కలే ఎక్కువగా ఉండటం గమనార్హం. సంగారెడ్డిలో 120.. ఉప్పల్ 92.. ప్రశాంత్ నగర్ 77.. నార్సింగ్ 70.. ఎల్ బీ నగర్ లో 69 చొప్పున రిజిస్ట్రేషన్లు జరిగాయి. ట్రిపుల్ వన్ జీవో నేపథ్యంలో శంషాబాద్ లో రిజిస్ట్రేషన్లు స్టార్ట్ కాలేదు. ఈ లెక్కన చూసినప్పుడు.. మూడు నెలలకు పైగా ఆపేసిన రిజిస్ట్రేషన్ల కారణంగా ప్రభుత్వం ఎంత భారీగా ఆదాయాన్ని కోల్పోయిందో గమనించారా సీఎం సాబ్?