రష్యాకు జెలెన్ స్కీ షాకిచ్చారా ?

Update: 2022-08-31 06:33 GMT
రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైన ఆరు మాసాల తర్వాత మొదటిసారిగా రష్యా సైన్యానికి షాక్ తగిలింది. రష్యాపై ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడులకు దిగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉక్రెయిన్లోని కీలక ఓడరేవు నగరమైన ఖేర్ సన్ పై ఉక్రెయిన్ సైన్యం వరుసబెట్టి మిస్సైళ్ళ వర్షం కురిపించింది. తన నగరంపై తానే మిస్సైళ్ళవర్షం కురిపించటం ఏమిటని అనుకుంటున్నారా ? ప్రస్తుతం ఈ నగరం మొత్తం రష్యా సైన్యం చేతిలో బంధీగా ఉంది.

అక్కడి నుంచి ఖాళీ చేయమని ఉక్రెయిన్ సైన్యం ఎంత చెప్పినా రష్యా సైన్యం పట్టించుకోవటంలేదు. దాంతో చేసేదిలేక ఒక్కసారిగా ఖేర్ సన్లో రష్యాసైన్యం ఎక్కడెక్కడైతే క్యాంపులు వేసుకుని కూర్చుందో అక్కడల్లా హఠాత్తుగా మిస్సైళ్ళతో విరుచుకుపడింది ఉక్రెయిన్ సైన్యం. దాంతో ఏమిచేయాలో అర్ధంకాక రష్యాసైన్యం ముందుబిత్తరపోయింది. ఎందుకంటే తమ సైన్యంపై ఉక్రెయిన్ మిస్సైళ్ళతో విరుచుకుపడగలదని రష్యా ఊహించలేదు.

అయితే  వెంటనే తేరుకుని ఎదురుదాడులు చేసినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. దాంతో రష్యా సైన్యాన్ని ఉద్దేశించి ఉక్రెయిన్ అధినేత ఖర్ సన్ను వదిలేసి వెళ్ళిపొమ్మని పదే పదే హెచ్చరికలు చేశారు. అయినా రష్యా సైన్యం నుంచి స్పందన కనబడలేదు.

దాంతో ఫైనల్ గా ఉక్రెయిన్ ఒక్కసారిగా మిస్సైళ్ళ వర్షం కురిపించింది. దాంతో  మిస్సైళ్ళ దాడిని  తట్టుకోలేక రష్యా సైన్యం నగరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఖర్ సన్ నగరంలో రష్యా సైన్యం ఎక్కడెక్కడ క్యాంపులు వేసిందన్న విషయాన్ని ముందుగానే ఉక్రెయిన్ సమాచారాన్ని సేకరించుకున్నది.

తన దగ్గర ఉన్న సమాచారాన్ని శాటిలైట్ల సాయంతో నిర్ధారించుకున్నది. వెంటనే మిస్సైళ్ళ వర్షం కురిపించింది. దాంతో తమసైన్యం కాంపులున్న అన్నిచోట్లా ఒకేసారి మిస్సైళ్ళ వర్షం కురవటంతో రష్యా సైన్యానికి తేరుకునేంత సమయం కూడా దొరకలేదు.

ఎంతోకొంత ప్రతిఘటించినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. అంటే రష్యా సైన్యం చాలా రిలాక్సుడుగా ఉన్నట్లు అర్ధమైపోతోంది. ఏదేమైనా యుద్ధం మొదలైన ఆరుమాసాలకు ఎదురుదాడులతో హడలెత్తించిన ఉక్రెయిన్ దెబ్బకు రష్యా సైన్యం ఇంకెంత మూల్యం చెల్లించుకోవాల్సుంటుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News