పిచ్చోడి చేతిలో రాయి మాదిరి.. నరహంతకులైన ఉగ్రవాదుల చేతుల్లో బాంబులు అదే పనిగా పేలుతుంటాయి. వారికి వారి లక్ష్యం తప్పించి మానవత్వం.. మమకారం లాంటి పదార్థాలు వారి డీఎన్ ఏలోనే ఉండవన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా చోటు చేసుకున్న శ్రీలంక బాంబు పేలుళ్లలో చనిపోయిన ఒక అమెరికన్ ఫేస్ బుక్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరణించటానికి ముందు అతను పెట్టుకున్న పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. చదివినంతనే కన్నీళ్లు తెప్పించేలా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ పోస్టులోకి వెళితే..
బ్రిటన్ కు చెందిన ఎడ్యుకేషన్ .. పబ్లికేషన్ కు చెందిన పియర్స్ కంపెనీలో పని చేస్తున్నారు అమెరికాకు చెందిన 40 ఏళ్ల డైటర్ కోవల్స్కి. ఆఫీసు పని నిమిత్తం వారంపాటు శ్రీలంకలో పని చేయటానికి అక్కడకు వెళ్లారు. శ్రీలంక ట్రిప్ నకు ముందు ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
అందులో.. ఫన్ మొదలైంది. వర్క్ ట్రిప్స్ ను చాలా ఇష్టపడతాను.. 24 గంటల ప్రయాణం.. శ్రీలంక.. త్వరలో నిన్ను చూస్తాను అంటూ పోస్ట్ చేశారు. శ్రీలంకలో ల్యాండ్ అయిన తర్వాత కంపెనీ అలాట్ చేసిన హోటల్లో ఆయన వెళ్లారు. ఆ సమయంలో జరిగిన బాంబు పేలుళ్లలో డైటర్ మృత్యువాత పడ్డారు.
ఆయన మరణం గురించి కంపెనీ సీఈవో స్పందించారు. డైటర్ ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు.. తన చుట్టూ ఉండేవారిని కూడా నవ్విస్తూ ఉంటారని.. సంతోషంగా ఉంచుతారన్నారు. అతడి మంచితనం వల్ల ఆయన ఎక్కడికి వెళ్లినా కొత్త స్నేహితుల్ని తయారు చేసుకుంటారన్నారు. ఎలాంటి సమస్యనైనా ఓర్పుతో పరిష్కరిస్తారని.. కొన్ని సాంకేతిక సమస్యల్ని ఫిక్స్ చేయటానికి శ్రీలంకకు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. వారంపాటు ఉండి.. ఇష్యూ సాల్వ్ చేయాలనుకున్నాడు కానీ.. ఉగ్రవాదులు జరిపిన బాంబుపేలుళ్లలో అతడు మరణించారు.
దుష్టులు చేసిన దాడిలో చాలామంది అమాయకుల మాదిరే డైటర్ కన్నుమూశారు. డైటర్ లాంటోళ్లు కొత్తవి క్రియేట్ చేయటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ.. ఉగ్రదాడికి పాల్పడిన వారికి మాత్రం కేవలం నాశనం చేయటమే తెలుసని పోస్ట్ చేశారు. ఈ పోస్టు పలువురు కంట కన్నీరు తెప్పిస్తోంది.