ఉగాది నుంచి ఏపీలో మనుగడలోకి రాబోతున్న కొత్త జిల్లాల అంశం తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. జిల్లాలకు పెట్టిన పేర్లు హాట్ టాపిక్ గా మారాయి. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలంటూ ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దామోదరం సంజీవయ్య చేసిన సేవలను గుర్తు చేశారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించారు. ఉమ్మడి ఏపీలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని శశిధర్ రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం.. అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా కేంద్రాన్ని నిర్ధారించడం మంచి నిర్ణయమని వ్యాఖ్యానించారు. రాయచోటి, పుట్టపర్తిని ఆయన దీనికి ఉదహరించారు.
రాజంపేట పార్లమెంట్ స్థానం అయినప్పటికీ దీనికి దూరంగా ఉన్న మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మధ్యలో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏపీ ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు.
ప్రతి కొత్త జిల్లాలోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్య సమానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం.. అక్కడి ప్రభుత్వ ముందుచూపునకు నిదర్శనమని చెప్పారు. వీటన్నింటిని బట్టి చూస్తే కొత్త జిల్లా ఏర్పాటు వ్యవహారం ఆసామాషీగా జరగలేదని అర్థమవుతోందని శశిధర్ రెడ్డి అన్నారు.
పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలను తీసుకుందని.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు అభినందనీయమని ఆయన వ్యాఖ్యానించారు.
విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం.. వైఎస్ జగన్రాజకీయ పరిణిణికి అద్దం పట్టిందని పేర్కొన్నారు. ఒక సామాజిక వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అనే అపవాదును ఆయన తొలిగిపోయినట్టవుతుందని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి సమీక్షలు చేయలేదని.. హడావుడిగా ఈ ప్రక్రియ పూర్తి చేశారని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. దాని వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా కేసీఆర్ కొత్త జిల్లాలుసృష్టించారని.. టీఆర్ఎస్ బలాన్ని పెంచడానికే చేశారని.. జగన్ మాత్రం ప్రజల సౌకర్యార్థం చేశారని విమర్శించారు.