ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలుగు ప్రజలు ఎవరూ మర్చిపోరు. ఇప్పటికీ వైఎస్ పేరు చెబితే బావోద్వేగానికి గురయ్యే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆయన ఆడగుజాడల్లో నడుస్తామని విభజిత ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తెలంగాణలోనూ వైఎస్ ఆశయాలు కొనసాగిస్తామంటూ ఆయన కుమార్తె షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసి పాదయాత్రకు.. ఇప్పుడు షర్మిల చేస్తున్న పాదయాత్రకు చాలా తేడా ఉందని విశ్లేషకులు, కొందరు నేతలు ఘంఠాపథంగా అభిప్రాయపడుతున్నారు.ఆనాటి పాదయాత్రలో వైఎస్ పేద ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి హామీలు ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు షర్మల తన పరుష వ్యాఖ్యలతో మీడియాలో ప్రముఖంగా కనిపించాలని చూస్తున్నారని అంటున్నారు.
2003 వరకు చంద్రబాబు పాలనలో ఉన్న ఉమ్మడి ఏపీ ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడ్డారు. ఆనాడు గ్రామ గ్రామాన తిరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి సమస్యలను దగ్గరుండి మరీ పరిశీలించారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.
వైఎస్ చేసిన పాదయాత్రలో ఆనాడు టీడీపీ ప్రభుత్వం అడ్డు చెప్పలేదు. అలాగని వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీడీపీ పై ఆరోగ్యకరమైన విమర్శలు మాత్రమే చేశారు. ఎక్కడా పరుష వ్యాఖ్యలు చేయలేదు.
అయితే సొంత పార్టీ నేతలో ఆయన పాదయాత్రకు అడ్డుపుల్లలు వేశారని ఓ ప్రచారం ఉంది. ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయో మాత్రమే చెప్పారు. అంతేకాకుండా తనను మీడియా ఫోకస్ చేసినా, చేయకున్నా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం అన్నట్లు ముందుకు వెళ్లారు.
ఆయన అడుగుజాడల్లోనే పాదయాత్ర చేస్తున్నానని షర్మిల చెబుతున్నా.. వాస్తవంగా అలా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. తెలంగాణలో నిజంగా సేవ చేయాలనుకునే షర్మిలకు సమస్యలు కనిపించడం లేదా? అని కొందరు విమర్శిస్తున్నారు.
ఒక నియోజకవర్గానికి వెళ్లి అక్కడి ఎమ్మెల్యేలను తిట్టినంత మాత్రాన ప్రజలు షర్మిలకు దగ్గరవుతారనుకోవడం పొరపాటే అని అంటున్నారు. వరంగల్ జిల్లాలో షర్మిల పర్యటించిన సమయంలో అక్కడి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యాలు చేశారు. తాజాగా మరోసారి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఘాటు విమర్శలు చేశారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం వేరు.. స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసి మీడియాలో హైలెట్ కావడం వేరు.. షర్మిల ఇందులో రెండో విధానాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. మీడియాలో ప్రముఖంగా కావడానికి పదే పదే అరెస్టు కావడంతో ప్రజలు అక్కున చేర్చుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ సమస్యలు లేవనుకోవడం కాదు. అలాంటి వాటిని వెతికి పట్టి వాటి పరిష్కారం కోసం తానేం చేస్తారో చెప్పడం ద్వారా ఎంతో కొంత మేలు జరుతుందని అంటున్నారు. అంతేగానీ ఇలాంటి విధానాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.