రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేసిన దిల్ రాజు

Update: 2023-04-04 14:49 GMT
టాలీవుడ్ లో ఇప్పుడు నంబర్ 1 ప్రొడ్యూసర్. బడా హీరోలు అందరూ ఒక్క పిలుపుతో ఆయన సినిమాలో చేసేస్తుంటారు. సినిమా రంగంలోనే కాదు.. ఆయన రాజకీయ నేతలతో కూడా అనుబంధం ఎక్కువ. చాలా రోజులు గా దిల్ రాజు రాజకీయాల్లో కి రాబోతున్నాడని ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఆయనకు ఆ ఆశ ఉందన్న ఊహాగానాలు సాగాయి. అయితే దీని పై దిల్ రాజు ఎప్పుడూ బయటపడలేదు. కానీ రాజకీయ నేతలతో స్నేహం మాత్రం కొనసాగిస్తూ వస్తున్నారు.

సినీ ఇండస్ట్రీకి, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. నాటి ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, మురళీ మోహన్, రోజా, పవన్ కళ్యాణ్ , ఫృథ్వీ, జీవిత రాజశేఖర్, అలీ ఇలా ఎందరో రాజకీయాల్లోకి వచ్చి కొందరు పదవులు కూడా అనుభవించారు. దిల్ రాజు కూడా ఇప్పుడు ఇలానే రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

రాజకీయ రంగ ప్రవేశం పై దిల్ రాజు తాజాగా కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి రావాలని తనను పలువురు నేతలు ఆహ్వానిస్తున్నారని సినీ నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించారు. అయితే ఎంట్రీ పై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని తెలిపారు.

గత కొన్నిరోజులుగా దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన బలగం సినిమా ప్రమోషన్ ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేదిక పైనే కేటీఆర్.. దిల్ రాజు రాజకీయాల్లోకి రావాలని.. ఆయనకు ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించారు.

దిల్ రాజు కూడా మంచి సమయం, సందర్భం, పార్టీ లభి స్తే రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ఓ ప్రకారం సాగుతోంది. కరెక్ట్ టైం చూసి పార్టీలో చేరాలని చూస్తున్నాడు. అది ఏ పార్టీ అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన స్వస్థలం నిజామాబాద్ నుంచి ఎంపీ గా పోటీచేసేందుకు దిల్ రాజు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News