దిల్ షుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు ఎన్ ఐఏ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు పూర్తయిన తర్వాత న్యాయమూర్తి వారందరికీ ఉరిశిక్ష ఖరారు చేశారు. కాగా...ఈ కేసులో నిందితులకు మరణ శిక్ష విధించాలని ఎన్ ఐఏ తరపు న్యాయవాది వాదించారు. శిక్షపై ఏదైనా చెప్పదలచుకున్నారా? అని నిందితులను న్యాయమూర్తి ప్రశ్నించారు. తాము చెప్పేదేమీలేదని, ఎలాంటి శిక్షకైనా సిద్దంగా ఉన్నామని నిందితులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
దిల్ షుఖ్ నగర్ లో 2013 ఫిబ్రవరి 21న రాత్రి 7 గంటలకు జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 130 మందికి గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ పాకిస్థాన్ లో తలదాచుకున్నాడు. అసదుల్లా అఖ్తర్ - వకాస్ - తెహసీన్ అఖ్తర్ - యాసిన్ భత్కల్ - ఎజాజ్ షేక్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/