ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అర్థం కాని సందిగ్థత నెలకొన్న వేళ.. వరుస శుభవార్తలు వింటే ఎలా ఉంటుంది? ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి ఇంచుమించు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన విపరీతమైన టెన్షన్లు ఎదుర్కొన్నారు. తనను నమ్మి.. ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన చిన్నమ్మకు.. ఆమె బంధువు దినకరన్‌కు దెబ్బ మీద దెబ్బేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దానికి నిరసనగా కొందరు ఎమ్మెల్యేలను తీసుకొని దినకరన్ వేరు కుంపటి పెట్టిన సంగతి తెలిసిందే.
పళనిస్వామి ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయిందని.. అసెంబ్లీని ఏర్పాటు చేసి బలపరీక్షకు ఆహ్వానించాల్సిందిగా దినకరన్ పదే పదే విన్నవిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. దినకరన్ గూట్లో ఉన్న వారిపై అనర్హత వేటు వేయటం ద్వారా పళని ఒక అస్త్రాన్ని సంధిస్తే.. హైకోర్టును ఆశ్రయించటం ద్వారా తమిళనాడు సీఎంకు షాకివ్వాలని దినకరన్ భావించారు.
అయితే.. ప్రస్తుతం పళని టైం దివ్యంగా నడుస్తుండటంతో దినకరన్ ఆశలు నెరవేరలేదు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ బలనిరూపణ నిర్వహించకూడదంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో సందిగ్థత నెలకొంది. ఇదిలా ఉంటే.. దినకరన్ వర్గంలో కీలక నేత అయిన వసంతి తాజాగా పళనిస్వామి వర్గంలోకి వచ్చేశారు.
దినకరన్ కు మొదట్నించి విశ్వసనీయురాలిగా ఉంటూ వస్తున్న ఆమె.. తాజాగా పళని.. పన్నీర్ గ్రూపులోకి రావటంతో ఆ వర్గం ఆనందం అంతాఇంతా కాదు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో మరికొందరు నేతలు సైతం పళని.. పన్నీర్ టీంలోకి క్యూ కట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. చూస్తుంటే.. పళనికి దసరా పండుగ ముందే వచ్చినట్లు కనిపించట్లేదు?