పవన్ ఎంత మేధావి అంటే...?

Update: 2017-12-08 15:30 GMT
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ను విమర్శించడంలో ముందుండే కత్తి మహేశ్ చేసిన తాజా విమర్శ తెలుసు కదా.. పవన్ అజ్ఞాతవాసి కాదు - అజ్ఞానవాసి అన్నారాయన. పవన్ అభిమానులు కత్తిపై కత్తులు నూరుతున్నా పవన్ ప్రసంగాలు విన్నవారు మాత్రం కత్తి అన్నదాంట్లో తప్పేమీ లేదంటున్నారు. చూడ్డానికి మేధావిలా కనిపిస్తున్నా పవన్ కు అంత సీను లేదంటున్నారు.
    
చేతిలో పుస్తకం.. కాటన్ కుర్తా లేదంటే ముతక చొక్కా - లోతైన కళ్లు - బిగిసే పిడికిలి వంటివన్నీ కలిపి పవన్‌ కు మేధావి రూపం తెచ్చాయి. ఆయన అధ్యయనశీలే కావొచ్చు.. పుస్తకాలను కాచి వడబోసి ఉండొచ్చు - కానీ, ఆయన మాటల్లో అది కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. ప్రత్యేక హోదా విషయంలో నిర్మలా సీతారామన్‌ - పరకాలలను నిందించడం ఆయన అపరిపక్వతను చాటుతోందని విశ్లేషిస్తున్నారు.
    
ఇప్పుడే కాదు, పవన్ గతంలోనూ ఇలాగే వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఎంపీలను మాత్రమే ప్రశ్నించారని... వారిని నడిపిస్తున్న చంద్రబాబును మాత్రం ఒక్క మాట అనలేదని గుర్తు చేస్తున్నారు.  ఇప్పుడు కూడా ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వంలో పరకాల తన భార్యను మంత్రిగా ఎలా కొనసాగనిస్తున్నారని ఆయన ప్రశ్నించడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. చంద్రబాబునో - మోదీనో నేరుగా ప్రశ్నించాల్సింది పోయి ఉరుముఉరిమి మంగళంపై పడినట్లుగా పరకాలపైనా - నిర్మలాసీతారామణ్ పైనా మండిపడడం ఏంటంటున్నారు.
Tags:    

Similar News