వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మారిన కాల మాన పరిస్థితుల్లో వాన రాక గురించి కచ్ఛితంగా చెప్పేవారు లేరనే చెప్పాలి. టెక్నాలజీ ఇంతలా పెరిగిపోయినా వాన ఎప్పుడు పడుతుంది? ఎంత పడుతుందన్న విషయాన్ని నూటికి ఎనభై శాతం కచ్ఛితంగా చెప్పే వారు కనిపించరు. అదిగో వచ్చేశాయ్ రుతుపవనాలు అన్న మాటలు చెబుతూనే.. ఇంకేముందు మరో నాలుగు రోజులు.. మరో 36 గంటలు.. ఇంకో 24 గంటలు అని చెప్పటేమే కానీ.. పడే వర్షం ఎంతన్నది గడిచిన కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న వారందరికి తెలిసిందే.
ఇంతకీ వానకు.. పవన్ కల్యాణ్ కు లింకేమిటన్న ప్రశ్న మీకు రావొచ్చు. ఆ సమాధానమే చెప్పబోతున్నాం. కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ వైఖరిని చూడండి. ప్రత్యేక హోదా మీద ఎంత లొల్లి జరుగుతున్నా.. తనకేం సంబంధం లేన్నట్లుగా ఉండిపోయారు. మొన్నటికి మొన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తన ఇంటికి వచ్చి తన కొడుకు సినిమా గురించి మాట్లాడిన సందర్భంగా బయట ఉన్న మీడియాతో పవన్ కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా హోదా గురించి మాట్లాడినప్పుడు కూడా.. ఆచితూచి మాట్లాడారే కానీ.. సంచలన వ్యాఖ్యలు చేయలేదు సరికదా.. ఆ సంకేతాలు ఇచ్చేలా కూడా వ్యాఖ్యలు చేయలేదు.
ఇది జరిగి రోజుల వ్యవధిలోనే తన అభిమానిని కర్ణాటకలోని కోలార్ లో దారుణంగా హత్య చేయటం.. చెట్టంత కొడుకును కోల్పోయిన శోకంలో ఉన్న అభిమాని తల్లిదండ్రుల్ని ఓదార్చేందుకు వచ్చిన పవన్ ఉన్నట్లుండి ఒక్కసారిగా మారిపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓదార్పు కోసం వచ్చిన పవన్.. ఆ కార్యక్రమం అయ్యాక.. తిరిగి వెళుతూ.. కారు దగ్గరకు వచ్చిన ఆయన.. చుట్టూ ఉన్న జనసందోహాన్ని చూసి.. ఒక్క ఉదుటున కారు పైకి ఎక్కి చేతులు జోడించి చప్పున కిందకు దిగటాన్ని మర్చిపోకూడదు.
తీవ్రమైన భావోద్వేగంతో ఉన్న పవన్ ఆ సమయంలో అలా ఎందుకు చేశారు? వచ్చింది ఓదార్పు కోసమైతే.. పవన్ మాస్ ఫీట్ ఎందుకు చేశారు? అన్న ప్రశ్నలు ఒకరిద్దరి నోటి నుంచి వినిపించినా.. ఎవరూ దానికి సమాధానం చెప్పింది లేదు. అందుకే చెప్పేది.. తన రాక గురించి వాన ఎలా చెప్పదో.. తానేం చేయనున్నది పవన్ చెప్పరు. కురిసే వాన పెద్దదా? చిన్నదా? భారీ నష్టానికి గురి చేసేదా? అన్న అంచనాలు ఎలానో.. పవన్ సభ ఎందుకోసం? దేని కోసం? ఆయనేం చెబుతారు? ఆయన చెప్పే మాటలతో ఎవరికి ఎంత నష్టం? లాంటివి ఊహాగానాలే తప్పించి ఎవరూ కచ్ఛితంగా జరగబోయేది ఇది అని మాత్రం చెప్పలేరు. వాన రాక.. పవన్ అడుగూ రెండూ ఒక్కటే అన్న విషయాన్ని ఇప్పటికైనా ఒప్పుకుంటారా..?