దిశ నిందితుడి తండ్రి పరిస్థితి విషమం

Update: 2019-12-27 05:45 GMT
దిశ ఘటన యావత్ భారతాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద దిశను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఘటన జరిగి నెలరోజులు దాటి పోయింది. ఇటీవలే ఎన్ కౌంటర్ లో మరణించిన దిశ నిందితుల మృత దేహాలను కణనం కూడా చేసేశారు.

అయితే తాజాగా దిశ నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నారాయణ పేట్ జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య  ప్రయాణిస్తున్న బైక్ ను ఇన్నావా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో కుర్మయ్య కు తీవ్ర గాయాలైనట్టు తెలిసింది.

కుర్మయ్య పరిస్థితి విషమించడం తో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ వైపు కొడుకు చావు మరిచి పోకముందే తండ్రి చావు బతుకుల మధ్యన ఉండడం ఆ కుటుంబం లో విషాదం నింపుతోంది.
Tags:    

Similar News