పృధ్వీ పై దిశ చట్టం కేసు ...!

Update: 2020-01-13 11:30 GMT
టీటీడీ అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ కు చైర్మన్ గా కీలక పదవిని నిర్వహించి మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడిన కమెడియన్ పృధ్వీ తాజాగా బయటకు వచ్చిన రాసలీలల ఆడియో విషయంలో ఎస్వీబీసీ చైర్మన్ గా రాజీనామా చేశారు. అయినప్పటికీ పృధ్వీ రాసలీలల వ్యవహారంపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళా ఉద్యోగిని తో ప‌ృథ్వీ అసభ్యకర సంభాషణకు సంబంధించిన ఆరోపణల నేపధ్యం లో ప‌థ్వీ పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పృధ్వీ వ్యవహార శైలి ఇప్పటికే నచ్చని పలువురు ఉద్యోగులు తాజా పరిణామాల నేపధ్యంలో టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి ఆయనను తప్పిస్తే సరి పోదని దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అలాగే పృధ్వీ చైర్మన్ అయిన నాటి నుండీ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వాటిపై కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ టీటీడీకి భ్రష్టు పట్టించిన పృథ్వీపై టీటీడీ పరువు నష్టం దావా వేయాలని వారు అంటున్నారు. ప్రసిద్ధం పుణ్య క్షేత్రం , ఆధ్యాత్మిక కేంద్రం అయిన తిరుమలలో ఎస్వీ బీసీ చైర్మన్ గా ఉండి ఆయన చేసిన పని సిగ్గు చేటని, హేయమైన పని అని దీని పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు చెప్పారు.

అయితే, అది తన వాయిస్ కాదని, మార్ఫింగ్ చేసి ఎవరో తనను ఇరికించటానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు. అయినా జగన్ సీరియస్ కావటంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన రాజీనామా చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, తనపై విచారణ ముగిసిన తరువాత మళ్లీ ఆ సీట్లో కూర్చుంటానంటూ చెప్పుకొచ్చారు. తన వాయిస్‌ ను మార్ఫింగ్ చేసి ఆడియో లో పెట్టారంటూ పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ కోసం నిజ నిర్ధారణ కమిటీని నియమించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
Tags:    

Similar News