మహాకూటమి అంటే అర్ధం ఏమిటీ!?... మహాకూటమి అంటే మతలబు ఏమిటీ...!?... ఎన్ని పార్టీలు కలిస్తే మహాకూటమి అవుతుంది...!? మహాకూటమి తరఫున పోటీ అంటే ప్రత్యర్ధులు ఎవ్వరు....!?
ఈ ప్రశ్నలకు సామాన్యులే కాదు.... మహాకూటమితో కలుస్తున్న రాజకీయ నాయకులు కూడా సమాధానం చెప్పలేక పోతున్నారు. ఎందుకంటారా... పొత్తులు... సీట్ల సర్దుబాట్లు... అభ్యర్ధుల ఎంపిక వంటి అంశాలపై మహాకూటమిలోని పార్టీల్లో ఏర్పడ్డ స్థంభనే దీనికి సమాధానం చెబుతుంది. తెలంగాణ ఎన్నికలు ప్రకటించి రెండు నెలలు గడుస్తోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధుల ప్రకటనే కాదు.... ప్రచారంలోనూ దూసుకుపోతోంది. ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అయితే బరిలో నిలిచిన మహాకూటమిలోనే ఇంకా అస్పష్టత పోలేదు. అంతేనా... వారిలో వారే పోటీకి దిగి దానికి హుందాగా ఉంటుందని "ఫ్రెండ్లీ" పోటీ అని నామకరణం కూడా చేసేశారు మహాకూటమిలోని నాయకులు. మహాకూటమిలో ఉన్న పార్టీలు అధికారికంగా నాలుగు. కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - సిపీఐ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఇంత వరకూ బాగానే ఉంది. నామినేషన్ల సమయం వచ్చే సరికి మహాకూటమిలో లొసుగులు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. మహాకూటమి స్నేహంలో భాగంగా తెలంగాణ జన సమితికి అధికారికంగా తొమ్మిది స్ధానాలు కేటాయించారు. అయితే ఈ స్ధానాల్లో పోటీ చేస్తున్న తెలంగాణ జన సమితిపై ఫ్రెండ్లీగా పోటీకి నిలిపారు కాంగ్రెస్ నాయకులు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటే మండిపడే గాదె ఇన్నయ్యకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి టిక్కట్ ఇచ్చింది. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ రవిని పోటీలో నిలిపింది. ఇది ఇన్నయ్యకు ససేమిరా మింగుడుపడడం లేదు. దీంతో ఈ స్ధానంలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం దాదాపు పూర్తి అయినట్లే అంటున్నారు. ఇలా మహాకూటమి తరఫున పోటీ చేస్తున్న అన్ని స్ధానాల్లోనూ... కొండకచో రెండు మూడు ఎక్కువ స్ధానాల్లోనే కాంగ్రెస్ తన అభ్యర్ధులను నిలిపింది. మహాకూటమి అంటే అందరూ కలిసి ఒక అభ్యర్థిని బరిలో దించి పోటీ చేస్తారని ప్రజలు భావించారు. అయితే నామినేషన్ల వేసిన అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మహాకూటమి స్నేహం నామినేషన్ల ముందే తేలిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారంలోకి రాకముందే కొట్టుకుంటున్న మహాకూటమి పక్షాలు ఇక అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అని వారు ప్రశ్నిస్తున్నారు. నామినేషన్లు ముగిసే నాటికి సగం విజయం తన ఖాతాలో వేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయ్యే సమయానికి మిగిలిన సగం విజయం వస్తుందని అంటున్నారు. అంతే కాదు.... ఇదేం మహాకూటమి మహానుభావా అని కూడా ప్రజలు నవ్వుకోవడం ఈ ఎన్నికలకు ప్రత్యేకం.