సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు అమ్మకు అత్యంత సన్నిహితురాలైన శశికథ సోదరుడు దివాకరన్. అమ్మ మరణం నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే.. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వని వైనం కాస్తంత అసంతృప్తికి గురి చేసినా.. ఆయన మాటల్లో నిజం ఎంతన్న విషయాన్ని నిఘా వర్గాలు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
తాజాగా అమ్మ జయ మరణంపై మాట్లాడిన ఆయన.. గతంలో అమ్మపై మూడుసార్లు హత్యాయత్నం జరిగిందని.. అయితే ఆ మూడింటిని తాను సమర్థంగా అడ్డుకున్నట్లు చెప్పారు. అమ్మ ఫ్రంట్ పేరుతో ఆయన పార్టీ స్థాపించారు. ఈ పార్టీకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లలో చిన్నమ్మ శిశకళ ఫోటోను వాడారు. దీనిపై చిన్నమ్మ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
దివాకరన్ పెట్టిన పార్టీ ఫ్లెక్సీల్లో తన ఫోటోను వాడటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన శశికళ.. తన లాయర్ ద్వారా నోటీసులు పంపారు. అయితే.. చిన్నమ్మ తరఫున ఆమె బంధువు దినకరన్ పంపారు. దీనిపై మండిపడిన దివాకరన్.. తనపై కుట్ర పన్ని దినకరన్ తనకు నోటీసులు పంపారని.. ఇకపై తనకు చిన్నమ్మ ఫ్యామిలీ మెంబర్ అన్న ట్యాగ్ అక్కర్లేదన్నారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ అమ్మను మూడుసార్లు కాపాడిన ఉదంతాల వివరాల్ని వెల్లడిస్తే బాగుండేది. కానీ.. ఆ విషయాలు మాత్రం ప్రస్తావించకుండా ఉండటం గమనార్హం.