దేశంలోనే మొదటి సారి విడాకుల నమోదు చట్టం

Update: 2022-03-18 16:30 GMT
కేరళ కొత్త చట్టానికి శ్రీకారం చుట్టనుంది. విడాకులను చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి వాటిని నమోదు చేసేలా కొత్త గా చట్టాని తీసుకు రావాలని చూస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలకు ఈ చట్టం ఆదర్శం కానుందని ఆ రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కేవలం వివాహాలు మాత్రమే చట్ట బద్ధంగా అయ్యేవని.. ఇకపై విడాకులు కూడా కచ్చితంగా చట్టం పరిధిలోకి వచ్చి వాటి నమోదు ప్రక్రియను తప్పనిసరి చేసేలా అడుగు వేస్తుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి గోవిందన్ తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎవరూ తీసుకురాని చట్టాని  తాము తీసుకుని వచ్చి అమలు చేస్తామని చెబుతున్నారు. దీనికి సంబంధించిన చట్ట సవరణలు కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఈ చట్టాన్ని తీసుకుని వచ్చి అమలు చేస్తే ఇలా చేసిన మొట్ట మొదటి రాష్ట్రంగా కేరళ నిలుస్తుందని  మంత్రి గోవిందన్ తెలిపారు.

తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసి అండగా నిలిచే ప్రభుత్వం అని చెప్పిన ఆయన.. మహిళల సంక్షేమంతో పాటు పిల్లులు,  లింగ మార్పిడికి చేయించుకున్న వారితో సహా వికలాంగులకు ఈ చట్టం అండగా ఉంటుందని ఆయన  అన్నారు. ఇప్పటికే వీరి సంక్షేమానికి సంబంధించి కేరళ శాసనసభ కమిటీ పలు కీలక సిఫార్సులు చేసినట్లు చెప్పారు.  ఈ కారణం గానే విడాకుల నమోదు చట్టాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.  

ఈ చట్టానికి సంబంధించిన కొన్ని కీలక  చట్టాలు నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని అన్నారు. ఈ చట్ట సవరణలు పూర్తి స్థాయిలో సిద్ధం అయిన తర్వాత కేరళ అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. కేరళ చేపట్టబోతున్న ఈ విడాకులు నమోదు చట్టంతో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం తెరతీయ బోతుందని అన్నారు.

దీనిపై దేశవ్యాప్తంగా 2008లో చర్చ జరిగినట్లు మంత్రి చెప్పారు. భారతీయ లా కమిషన్ కూడా విడాకుల నమోదు ను తప్పనిసరిగా చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పినట్లు పేర్కొన్నారు. మతం ఏదైనా సరే ఈ చట్టం వర్తించేలా చేయాలని అప్పటి నివేదిక చెప్పినట్లు వివరించారు.  దీనిలో భాగంగానే కేరళ వివాహ నమోదు చట్టానికి మార్పులు చేర్పులు చేయనున్నారు.  లా కమిషన్ సూచించిన విధంగా చట్టాన్ని తీసుకు వస్తామని చెప్పారు.
Tags:    

Similar News