తెలంగాణలో ఇప్పుడు జిల్లాల విభజన కోసం భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వరంగల్‌లోని జనగాను జిల్లాగా ప్రకటించాలన్న ఆందోళన ఒక్కటే ఉంటే.. తాజాగా గద్వాలను ప్రత్యేక జిల్లా చేయాలనే ఆందోళన శుక్రవారం మిన్నంటింది. మాజీ మంత్రి - కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ ప్రత్యేక జిల్లా డిమాండ్ తో రోడ్డెక్కారు. ఎర్రవల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఆమె ఆందోళనకు దిగారు.
అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా డీకేకు మద్దతుగా తన అనుచరులతో కలిసి ఆందోళనకు వచ్చారు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. ఫలితంగా కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు డీకే అరుణ - సంపత్ కుమార్ లను అరెస్టు చేసేందుకు యత్నించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు డీకే అరుణ - సంపత్ లను అరెస్టు చేశారు.
మరోపక్క - ఉత్తర తెలంగాణలో వరంగల్ జిల్లా జనగామలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వి వాహనాలను ధ్వంసం చేయడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. జనగామను జిల్లా కేంద్రం చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. దీంతో హైదరాబాద్ -వరంగల్ హైవేపై అంతా ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారులు హైవేపై బైటాయించడంతో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిగిరి యాదగిరిరెడ్డి ఇంటిని ఆందోళనకారులు ముట్టడించే యత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తంతు అంతా చూస్తుంటే తెలంగాణలో కొత్త ఉద్యమం వస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.