అటు ఏపీ రాజకీయాలనే సరిగా పట్టించుకోవడం లేదని అపవాదును ఎదుర్కొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించడం విశేషం. తెలంగాణలో జనసేన బలోపేతానికి ఆయన అడుగులు వేస్తున్నారు. త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఉప ఎన్నిక జరుగనున్న మూడు జిల్లాలకు పార్టీ ఇన్ చార్జీలను నియమించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తాళ్లూరి రామ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆకుల సుమన్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సతీష్ రెడ్డిలను జనసేన ఇన్చార్జీలుగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. సుమన్ తాజాగా పవన్ సమక్షంలో పార్టీలో చేరిన వెంటనే వరంగల్ జిల్లా బాధ్యతలను అప్పగించడం విశేషం.త్వరలోనే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. నల్గొండలో నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగబోతోంది. ఈ నేపథ్యంలోనే మూడు జిల్లాలకు ఇన్ చార్జీలను పవన్ నియమించారు.
ఇటీవల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ్ జనసేన పార్టీని తీసేపారేసినట్టు మాట్లాడారు.. జనసేనతో తమకు ఎలాంటి పొత్తు లేదన్నారు. జీహెచ్ఎంసీలో పవన్ మద్దతు తీసుకొని అలా వ్యాఖ్యలు చేయడం ఏంటని జనసైనికులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే పార్టీకి జిల్లాల ఇన్చార్జిలను నియమించి బలోపేతం దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు.