తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడే కొద్దిమంది విపక్ష నేతల్లో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్‌నేత.. మాజీ మంత్రి డీకే అరుణ ఒకరు. కేసీఆర్ కో పొడను ఏ మాత్రం గిట్టని అరుణమ్మ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగే ప్రయత్నం చేశారు. అయితే.. ఆమె ఎంత ఆవేశంగా మాట్లాడినా.. కంటెంట్ మొత్తం పాతదే కావటంతో ఎఫెక్ట్ మిస్ అయిన పరిస్థితి.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని షురూ చేసిన తెలంగాణ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టిన డీకే.. ప్రాజెక్టు డిజైన్ల మార్పులో జేబులు నింపు కోవాలన్నదే లక్ష్యమన్నారు. చివరిదశలో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ పని చేయని కేసీఆర్ సర్కారు కొత్త ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టటం ఏమిటని ప్రశ్నించారు.
ప్రజల మీద అప్పుల భారం పెంచారని.. సెంటిమెంట్ తో ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారన్న డీకే అరుణ.. డిజైన్ మార్చటం ద్వారా జేబులు నింపుకోవాలన్న లక్ష్యంలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లుగా ఆరోపించారు. పాత విషయాలతో విమర్శలు.. ఆరోపణలు చేసిన డీకే అరుణ తన ప్రెస్ మీట్ తో పెద్ద మైలేజీ పొందలేకపోయారన్న మాట వినిపిస్తోంది.