తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై వివాదాలు - విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా తమ డిమాండ్లకు ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదంటూ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ - సీనియర్ లీడర్ డీకే అరుణ ధర్నాకు దిగారు. బెంగళూరు హైవేను ఆమె దిగ్బంధించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఒక్క అంగుళం కూడా ముందుకెళ్లడానికి లేకుండా మారిపోయింది. డీకే అరుణ్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హైవే పైకి చేరుకోవడంతో వాహనాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఇంత తీవ్రమైన ఎఫెక్టు చూపించడం ఇదే తొలిసారని చెబుతున్నారు. అయితే... ఇది కాంగ్రెస్ సత్తా కాదని, డీకే అరుణ సత్తా అని చెబుతున్నారు.
కాగా మహబూబ్ నగర్ లోని గద్వాలను జిల్లా చేయాలని ఆ ప్రాంతానికి చెందిన నేత అయిన డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు కూడా. గద్వాల జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు జరిగే మేలుపై ఆమె వివరణాత్మకంగా సీఎం కేసీఆర్ కు ప్రతిపాదనలు కూడా పంపించారట. అయితే... టీఆరెస్ ప్రభుత్వం అదేమీ పట్టించుకోలేదు. కొత్త జిల్లాల జాబితాలో గద్వాలకు స్థానం దక్కలేదు. ఈ సంగతి తెలుసుకున్న అరుణ పోరాటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. దాంతో వేలాదిగా అనుచురులతో కదలివచ్చి బెంగళూరు హైవేను దిగ్బంధించారు. ఎర్రవల్లి చౌరస్తా వద్దకు వచ్చిన ఆమె జాతీయ రహదారిపై బైఠాయించడంతో తవర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
కాగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉన్న డీకే ఈ రేంజిలో తన సత్తా చాటడంతో ఒక్కసారి అందరి దృష్టి ఆమెపై పడింది. గద్వాల జిల్లా కోసం పోరాడడంతో పాటు అధిష్ఠానానికి తన సత్తా చూపడం కోసం కూడా ఆమె ఈ ధర్నా చేశారని కాంగ్రెస్ లోని కొందరు నేతలు అంటున్నారు. కారణమేదైనా కానీ తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు ఇంకా ప్రజాదరణ ఉందని ఆమె నిరూపించారని అంటున్నారు.