రాజకీయాలు ఎప్పుడు ఎవరిని హీరోను చేస్తాయో? ఎప్పుడు జీరోను చేస్తాయన్నది చెప్పటం చాలా కష్టం. అప్పటివరకూ సాదాసీదాగా ఉండే వ్యక్తికి అంతులేని ఇమేజ్ వచ్చి పడుతుంది. సమస్యలకు ఎదురెళ్లిన వారిని.. అలాంటి వాటిని ఫేస్ చేయటానికి ప్రయత్నించిన వారిని ప్రజలు ఎంతలా అభిమానిస్తారు.. మరెంతలా ఆరాధిస్తారన్న దానికి నిదర్శనంగా తాజాగా బెంగళూరులో చోటు చేసుకున్న పరిణామం నిదర్శనంగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ గా.. తాను ఎంట్రీ ఇవ్వటంతోనే సీన్ మొత్తాన్ని మార్చేస్తారన్న పేరున్న డీకే శివకుమార్ ఇటీవల తీహార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈడీ ఆరోపణలు.. విచారణ ఆ తర్వాత అరెస్టుతో కొద్దిరోజులుగా తీహార్ జైల్లో ఉన్న డీకే శివకుమార్ తాజాగా బెయిల్ మీద విడుదల కావటం తెలిసిందే. ఢిల్లీ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చిన ఆయనకు ఎయిర్ పోర్ట్ నుంచి కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకోవటానికి నాలుగు గంటలు పైగా సమయం పట్టటం గమనార్హం. శివకుమార్ కు స్వాగతం పలికేందుకు వేలాది మంది ప్రజలు కిలోమీటర్ల కొద్దీ రోడ్ల పక్కన వెయిట్ చేయటం చూసినప్పుడు.. తాజా ఎపిసోడ్ ఆయన ఇమేజ్ మొత్తాన్ని భారీగా మార్చేసిందన్న మాట వినిపిస్తోంది.
మాసిన గడ్డంతో.. కాస్త నీరసంగా కనిపించిన శివకుమార్ గొంతు మాత్రం స్థిరత్వంతో ఉండటం విశేషం. తాను జైల్లో ఏడ్చినట్లుగా వచ్చిన వార్తల్ని చూసి షాక్ తిన్నట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తాను ఏడ్చే రకం కాదన్న ఆయన.. తన మీద చూపిస్తున్న అభిమానం గురించి చెప్పే క్రమంలో మాత్రం పలుమార్లు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చిన ఒక నాయకుడి కోసం ప్రజలు ఇంతలా పోటెత్తటం ఇటీవల కాలంలో తాము చూడలేదన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం. ఎయిర్ పోర్ట్ నుంచి పార్టీ ఆపీసుకు చేరుకోవటానికి శివకుమార్ కు నాలుగు గంటలకు పైగా సమయం పట్టగా.. వేలాది మంది కారణంగా గార్డెన్ సిటీ ట్రాఫిక్ భారీగా జామైంది. దీంతో.. మహానగరం రవాణ పరంగా స్తంభించిన పరిస్థితి నెలకొంది.