ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా కొనసాగిన వారంతా ఇప్పుడు తెర వెనుక ఉన్నారు. తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ నాయకులంతా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయినా కొందరు పార్టీని వీడకుండా రాజకీయాలనే వదిలేసి సైలెంట్ గా ఉన్న నాయకులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో వైఎస్సార్ కు మంచి మిత్రులుగా కొనసాగిన వారు ఉన్నారు. వీరిని గుర్తించిన వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారిని తిరిగి రాజకీయాల్లోకి తీసుకువచ్చి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. తన తండ్రి వైఎస్సార్ తో ఉన్న అనుబంధం.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేసి ఉండడంతో వారిని తన పార్టీలోకి జగన్ ఆహ్వానిస్తున్నాడు. ఈ క్రమంలో వైఎస్సార్ కుటుంబసభ్యుడిగా.. వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్న మాజీ మంత్రి త్వరలోనే వైఎస్సార్సీపీలో చేరనున్నాడట.
వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కడప లోక్ సభకు జగన్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో జగన్ పై కాంగ్రెస్ తరఫున డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేసి ఘోరంగా పరాజయం పొందారు. ఆ ఎన్నికలో జగన్ 5.45 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన కనుమరుగయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు టీడీపీలో చేరాలని ఊగిసలాడారు. కానీ మనస్సాక్షి అంగీకరించలేదు. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అయితే ఇటీవల డీఎల్ బంధువర్గమంతా వైఎస్సార్సీపీలో చేరారు. డీఎల్ వియ్యంకుడు, మాజీమంత్రి గాదె వెంకట్ రెడ్డి, డీఎల్ అల్లుడు కూడా జగన్ పార్టీల చేరిపోయారు. ఇక డీఎల్ రవీంద్రారెడ్డి కూడా రావడం లాంఛనమేనని కడప జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ముందే తన బంధువర్గాన్ని పంపించేసి అనంతరం ఆయన వెళ్తారని ప్రచారం సాగుతోంది. వాస్తవంగా 2014 ఎన్నికల సమయంలోనే డీఎల్ రవీంద్రారెడ్డిని జగన్ స్వయంగా తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఆ మేరకు చర్చలు కూడా సాగాయి. కాకపోతే అప్పుడు చేరలేదు.. ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి డీఎల్ రవీంద్రారెడ్డి రానున్నారని సమాచారం.