రాజకీయాలు మహా చిత్రమైనవి. ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. నిజానికి రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదన్నది నూటికి నూరుపాళ్లు నిజం. తిట్టుకొని.. కొట్టుకునే వరకూ వెళ్లే నేతలు ఇద్దరు.. తర్వాతి కాలంలో ఒకరి భుజం మీద మరొకరు భుజం మీద చేతులు వేసుకొని వెళ్లే అవకాశం ఒక్క రాజకీయాల్లో మాత్రమే కనిపిస్తాయి. తాజాగా అలాంటి సన్నివేశమే ఏపీ రాజకీయాల్లో కనిపించనుంది.
కడప జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత డీఎల్ రవీంద్రారెడ్డికి.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఎంతలా వార్ జరిగిందో అందరికి తెలిసిందే. 2011 కడప ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ కుటుంబం పైనా.. జగన్ పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మాజీ మంత్రి రవీంద్రా రెడ్డి తాజాగా ఆయనతో నడిచే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
మైదకూర్ నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు.. అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లలో జగన్ బొమ్మతో పాటు డీఎల్ బొమ్మ కలిసి కనిపించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామంతో డీఎల్ జగన్ పార్టీ చేరటం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నికలో వైఎస్ వివేకానంద రెడ్డి బరిలోకి దిగుతున్న వేళ.. ఇప్పటికే ఆయన డీఎల్ ను కలిసి తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరటం.. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. రానున్న మరికొద్ది నెలల్లో డీఎల్ తన రాజకీయ పున: ప్రవేశం మీద బలమైన నిర్ణయం తీసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. కడప జిల్లాలో రాజకీయ పరిణామాల్లోమార్పులు చోటు చేసుకునే వీలుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/