మూడో ప్రపంచ యుద్ధం ముంగిట దేశాలు.. ఎవరీ లివింగ్ నోస్ట్రాడమస్?

తాజాగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ చర్చ బలంగా మొదలైంది.

Update: 2024-11-02 10:33 GMT

గత కొన్ని రోజులుగా మూడో ప్రపంచ యుద్ధం అనే అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. 2022లో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన మొదట్లో ఈ చర్చలు పెద్దగా జరగలేదు కానీ... తాజాగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ చర్చ బలంగా మొదలైంది. ఈ సమయంలో లివింగ్ నోస్ట్రాడమస్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అవును... గత కొన్ని నెలలుగా అటు రష్యా - ఉక్రెయిన్.. ఇటు ఇజ్రాయెల్ - హమాస్, హెజ్ బొల్లా మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే అంశం కూడా ఈ చర్చను ప్రభావితం చేస్తోందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో.. మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని అంటున్నారు లివింగ్ నోస్ట్రాడమస్! ఈ సందర్భంగా... ఇజ్రాయెల్, ఇరాన్ లు తమ సైనిక వ్యూహాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎక్కువగా ఉపయోగించుకుంటాయని.. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం వలన సంఘర్షణ మరింత పెరిగి ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టే అవకాశం ఉందని చెప్పారు.

ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా సమాజం పతనానికి, దేశాల్లో అరాచక వ్యాప్తికి “ఈఎంపీ” (ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పల్స్ - విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలను తాత్కాలికంగా లేదా శాస్వతంగా నిలిపివేయడానికి రూపొందించబడింది!) టెక్నాలజీ కారణమవుతుందని హెచ్చరించారు. ప్రధానంగా ఈ సాంకేతికతను అమెరికా, చైనా, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాలూ ఉపయోగిస్తున్నాయని తెలిపారు.

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ లివింగ్ నోస్ట్రాడమస్ మాట్లాడుతూ... అమెరికా - చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని.. ఫలితంగా దక్షిన చైనా సముద్రం అస్థిర ప్రాంతంగా మారే అవకాశం ఉందని.. దేశ భద్రతా వ్యవస్థపై సైబర్ దాడి చేయడం అనేది ఈ దేశాల మధ్య యుద్ధానికి దారితీయొచ్చని తెలిపారు.

ఎవరీ లివింగ్ నోస్ట్రాడమస్?:

బ్రెజిలియన్ మానసిక, పారానార్మల్ నిపుణుడు అయిన అథోస్ సలోమ్ నే.. లివింగ్ నోస్ట్రాడమస్ అని, న్యూ నోస్ట్రాడమస్ అని పిలుస్తుంటారు. గతంలో... కరోనా వైరస్ మహమ్మారి, ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడం, ఎలిజబెత్ రాణీ మరణించడం, మైక్రోసాఫ్ట్ అంతరాయం వంటి అనేక సంఘటనలను అతడు ఖచ్చితంగా అంచనా వేసినట్లు చెబుతారు.

ఇక నోస్ట్రాడమస్ విషయానికొస్తే.. ఆయన 1503 - 1566 మధ్య జీవించిన ఒక ఫ్రెంఛ్ జోతిష్యుడు, వైద్యుడు! ఈయన 1555లో ప్రచురించబడిన తన పుస్తకం లెస్ ప్రొఫెటీస్ తో ప్రసిద్ధి చెందాడు. ఇది భవిష్యత్ సంఘటనలను అంచనా వేస్తుందని కోంతమంది నమ్ముతారు.

Tags:    

Similar News