వెనకటికి గోదావరి సినిమాలో ఇంజినీరింగ్ చదువుకున్న కుర్రాడు సుమంత్ ఆసక్తి కొద్దీ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటాడు. పార్టీల వద్దకు వెళ్లి.. తాను పార్టీకోసం పనిచేస్తానని తనకు నెలకు కొంత జీతం ఇవ్వాలని అడుగుతాడు. రాజకీయాల్లో జీతం ఏమిట్రా అంటూ అతని మొహాన్నే నవ్వుతారు. కాకపోతే.. ప్రస్తుతం తమిళనాడులో ఇంతకుమించిన వాస్తవం - అతిపెద్ద జోకులాగా చెలామణీ అవుతోంది. తన ప్రమేయం లేకుండా.. తనకు సంబంధం లేకుండా రద్దు చేసిన ఎన్నికల్లో అప్పటిదాకా తాను పెట్టిన ఖర్చును ఎన్నికల సంఘం చెల్లించాలంటూ.. ఓ అభ్యర్థి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాడు. ఎన్నికల్లో కోట్లకు కోట్లు తగలేసినా.. అది గోడకు వేసిన సున్నం లాంటిదే.. దాని మీద ఆశ పెట్టుకోలేం అని అందరికీ తెలుసు. కాకపోతే తమిళ తంబి మాత్రం తన ఖర్చులు తిరిగివ్వాలని ఈసీని కోరుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. జయలలిత మరణం నేపథ్యంలో ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నికను గతంలోనే ప్రకటించారు. ఎన్నికల పర్వం కొంతకాలం నడిచింది. అన్నాడీఎంకే వారు ఓటర్లకు డబ్బు పంచుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అది నిర్ధరణ కావడంతో.. కేసులు నమోదు చేసి.. ఎన్నికను రద్దు చేశారు. ఈ డిసెంబరులోగా ఈ ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంది. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే... రద్దయిన ఉప ఎన్నికలో విపక్షం డీఎంకే పార్టీ తరఫున మరుదు గణేష్ పోటీ చేశారు.
ఆయన ఇప్పుడు ఈసీ గడప తొక్కారు. గత ఉప ఎన్నిక రద్దయ్యేలోగా తాను 5 లక్షల రూపాయలు ఎన్నికలకు ఖర్చు చేశానని, ఇతరులు డబ్బు పంచారనే ఆరోపణలు తేలడం వల్ల.. ఎన్నిక రద్దయి, తాను నష్టపోయానని, తన ప్రమేయం లేకుండా జరిగింది గనుక.. తాను సమర్పించిన లెక్కల ప్రకారం.. తాను పెట్టిన ఖర్చు 5 లక్షల రూపాయలను ఈసీ చెల్లించాలని ఆయన కోరుతున్నారు. లాజికల్ గా చూసినప్పుడు మరుదు గణేష్ చెబుతున్నది కరక్టే. తప్పు చేసింది మరొక పార్టీకి చెందిన వారు. మరి ఆయనకు సంబంధం లేకుండా ఎన్నిక రద్దయినప్పుడు.. ఆయనెందుకు నష్టం భరించాలి? ఈ విషయంలో ఈసీ ఎలా స్పందిస్తుందో తెలియదు గానీ.. డిసెంబరులోగా ఈ ఎన్నికను పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మరుదు గణేష్ లేఖ చర్చ అవుతోంది. ఈసీ పట్టించుకోకుండా, ఈ విషయంలో ఆయన కోర్టుకు వెళితే మాత్రం.. అరుదైన అంశం పైస్థాయి వరకు చర్చనీయాంశం అవుతుంది.