కేసీఆర్ చెన్నై టూర్ ఫెయిల్.. డీఎంకే నేత కొత్త స్టేట్‌మెంట్

Update: 2021-12-20 16:30 GMT
మూడడుగులు ముందుకు.. పదడగులు వెనక్కు.. అసలు ఏ అడుగూ పడదు. ఇదీ మూడో ఫ్రంట్ కథ. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ...బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ.. ఈ రెండింటికి దూరంగా మూడో కూటమి కట్టాలని ప్రాంతీయ పార్టీలు.. అంతా కలగూర గంప. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే.. యూపీఏకి నమ్మిన భాగస్వామి. బెంగాల్ లో మమతా బెనర్జీది ఊగిసలాట. కర్ణాటకలో జేడీఎస్ వైఖరిఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం.

మహారాష్ట్రలో శివసేనను నమ్మలేం. పక్కా హిందూత్వ పార్టీ అయినా.. కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో కొనసాగుతున్నా.. ఎప్పుడైనా బీజేపీ అంటే ఎన్డీఏలోకి వెళ్లే అవకాశం కొట్టిపారేయలేం. ఇక ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రస్తుతానికి ఎన్డీఏకు దూరమో దగ్గరో చెప్పలేం. బిహార్ లో జేడీఎస్ కూడా అంతే. మొత్తానికి దేశంలో యూపీఏ, ఎన్డీఏ కూటములు బలంగానే కనిపిస్తున్నాయి. ఎటొచ్చి మధ్యలో మూడో ఫ్రంట్ ప్రయత్నమే ప్రయాసగా మారుతోంది. మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ దిశగా చేసే ప్రయత్నాలు కొలిక్కి వచ్చేలా లేవు.

కాంగ్రెస్ లేకుండా చూద్దామని

మూడో ఫ్రంట్ అంటే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లేకుండా ఉండాలి. చాలా రాష్ట్రాల్ల్లో ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థులు. వీటితో ఫ్రంట్ కడితే తమ రాష్ట్రంలో జవాబు చెప్పుకోలేరు. బెంగాల్ లో మమత,తెలంగాణలో కేసీఆర్ ది ఇదే పరిస్థితి.కర్ణాటకలో జేడీఎస్ కూడా ఇంతే. అందుకే రెండు జాతీయ పార్టీలను పక్కనపెడుతూ ఫ్రంట్ కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు మమతా,కేసీఆర్. ఎన్సీపీ వంటి సొంత ఆలోచనలున్నపార్టీలు కలిసొస్తే కాలమూ కలిసొస్తే కేంద్రంలో అధికారం సాధించడమో, పవర్ సెంటర్ గాఎదగడమో చేయాలనేది వీటి ఉద్దేశం.

ఇదంత సులభమా?

అయితే, మూడో ఫ్రంట్ ప్రయత్నాలు ఎంతగా ఉన్నా.. చూచాయగానైనా ఫలించే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్ లేకుండ బీజేపీని గద్దె దించలేం అనేది ప్రశాంత్ కిశోర్ వంటి రాజకీయ నేతల విశ్లేషణ.ఈ క్రమంలో ఇటీవల మూడో కూటమి టార్గెట్‌గా కేసీఆర్ చెన్నై పర్యటనకు వెళ్లారు. డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ కీలక నేత, ఇలా టీఆర్ఎస్ తరపున ఇతర రాష్ట్రాల వ్యవహారాలను చక్కబెట్టే మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఈ మాట చెప్పడంతో థర్డ్ ఫ్రంట్ ప్రయత్నం స్పష్టమైపోయింది. కేసీఆర్ టూర్ అయిపోయి వారం అవస్తోంది.

డీఎంకే ఎంపీ ప్రకటనతో థర్డ్ ఫ్రంట్ హుళక్కి..

కేసీఆర్ ప్రయత్నాలు అలా సాగుతుండగా.. డీఎంకే లో జాతీయ వ్యవహారాలను చక్కబెట్టే ఎంపీ టీఆర్ బాలు ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు.అందులో ఎక్కడా కేసీఆర్ ప్రస్తావన రాలేదు కానీ… మూడో కూటమి అనే భావనతో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయవద్దని మమతా బెనర్జీని కోరారు.

మూడో కూటమి మమతా బెనర్జీ నేతృత్వంలో ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆమె ఆక్రమిస్తుందని.. ఇటీవల
చెబుతూ వస్తున్నారు. మమతా బెనర్జీ వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నరు. ప్రశాంత్ కిషోర్ ఇటీవల టీఆర్ఎస్‌తో సన్నిహితంగా ఉంటున్నారు.ఈ క్రమంలో ఆయన వ్యూహంలో భాగంగానే చెన్నై వెళ్లారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు మూడో కూటమికి వ్యతిరేకంగా డీఎంకేనుంచి ప్రకటన వచ్చింది. డీఎంకే ప్రస్తుతం యూపీఏలో ఉంది.

కాంగ్రెస్ పార్టీకి గట్టి..నమ్మకమైన మిత్రపక్షంగా ఉంది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి దూరం చేసే లక్ష్యంతో కేసీఆర్ రాజకీయం చేశారన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. ఇలాంటి సమయంలో డీఎంకే.. విపక్షాల ఐక్యతను దెబ్బతీయవద్దని .. ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కూటమి నుంచి స్టాలిన్ బయటుక వచ్చే అవకాశం వందశాతం లేదని తాజా పరిణామాలతో తేలిపోయింది.

అయితే కేసీఆర్ స్టాలిన్‌తో కలిసి నడవడం.. అంటే యూపీఏ కూటమిలో చేరడం..లేకపోతే జాతీయ రాజకీయాలపై సైలెంట్‌గా ఉండటం అనే రెండు ఆప్షన్లు ప్రస్తుతం ఉన్నాయంటున్నాంటున్నారు. ఇప్పుడు యూపీ ఏవైపు వెళ్తే కేసీఆర్‌కే నష్టం కాబట్టి.. వీలైనంత వరకూ కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో సైలెంట్‌గా ఉండే అవకాశాలే ఎక్కువగాఉన్నాయంటున్నారు.


Tags:    

Similar News