ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే వారిపై నేరుగా సూటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఒక కుక్కను చంపాలనుకుంటే దాన్ని చంపేస్తే లేనిపోని తలనొప్పి. అదే పిచ్చికుక్క అన్న ప్రచారం చేస్తే.. దాని దారిన అదే చస్తుంది. లేదంటే ఎవరోఒకరు చంపేస్తారు. మొత్తంగా చంపాలనుకున్న కుక్కను తెలివిగా చంపేసే పద్దతి ఇదే.
ఇప్పుడు ఇలాంటి వ్యూహాన్నే రజనీ విషయంలోనూ జాగ్రత్తగా అమలు చేసేలా కనిపిస్తోంది డీఎంకే నేతల మాటలు చూస్తుంటే. రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించి.. తన అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తారు రజనీ.
తాను సొంతంగా రాజకీయ పార్టీ పెడతానని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు రజనీకాంత్. ఆయన రాజకీయ రంగ ప్రవేశం మీద ఆచితూచి స్పందించినట్లు కనిపించిన డీఎంకే.. వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఏ అంశాన్ని టచ్ చేస్తే.. రజనీ ఇమేజ్ బద్నాం అవుతుందో సరిగ్గా అదే అంశాన్ని ప్రస్తావించటం గమనార్హం.
ఏ మోడీ పేరు వింటే తమిళులు కంపరంగా ఫీలవుతారో.. ఏ బీజేపీ పేరు వింటే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారో.. ఇప్పుడు అవే మాటల్ని ప్రస్తావించటం ద్వారా రజనీ మీద కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా డీఎంకే ప్రతినిధి శరవణన్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. తమ అధినేత ఇంటికి వచ్చిన మోడీ.. తమ పెద్దాయన చేతులు పట్టుకొని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరిన దానికి ఆర్కేపురం ఉప ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ ఇచ్చారో తెలిసిన నేపథ్యంలో.. బీజేపీకి రజనీకి లింకు పెడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి తాను మద్దతు చెబుతున్నాననో.. తనతోనే బీజేపీ చేతులు కలుపుతుందనో.. మొత్తం మీదా తెలిసో తెలియకో రజనీకాంత్ కమలం పార్టీతో ఒక అవగాహనకు వచ్చారు. బీజేపీ కూడా అలాంటి సంకేతాల్నే పంపిందన్నారు. తనకు రజనీకాంత్ వ్యక్తిగతంగా ఇష్టమే అయినా.. బీజేపీతో అవగాహన ఏర్పాటు చేసుకుంటే మాత్రం తమిళ ప్రజలు అంగీకరించటం కష్టమన్నారు. మొత్తానికి రజనీ నోరు తెరిచి తన వెనుక ఎవరున్నారో చెప్పకున్నా.. శరవణన్ చెవిలో తలైవా ఏదో చెప్పినంత చక్కగా చెబుతున్న తీరుచూస్తే.. రజనీపై విష ప్రచారం అప్పుడే మొదలైనట్లే. మరి ఇలాంటి ఎత్తులకు తలైవా ఎలాంటి చెక్ చెబుతారో..?