దేశంలో ప్రధానమంత్రి అత్యంత కీలకమైన వ్యక్తి. పరిపాలనలో మొదటి నాయకుడు. అలాంటి ప్రధానికి సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధాని ఎటు వెళ్లినా అక్కడి ప్రదేశాన్ని ముందే సెక్యూరిటీ సిబ్బంది ఆధీనంలోకి తీసుకొని, అక్కడి పరిస్థితులను పరిశీలించిన తరువాతే పర్యటనను ఖరారు చేస్తారు. ప్రధానిని వ్యక్తిగతంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) రక్షిస్తుంది. ఎస్పీజీ గతంలో నలుగురికి ఉండగా ప్రస్తుతం కేవలం ప్రధానమంత్రికే భద్రత కల్పిస్తుంది. అయితే ఈ భద్రతా బలగాల కోసం ప్రతీసారి బడ్జెట్లో కొంతమొత్తాన్ని కేటాయిస్తారు. దాదాపు 3 వేల మందికి పైగా ఈ గ్రూపులో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా సెక్యూరిటీ లోపంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని భద్రత గురించి కొన్ని విశేషాలు..
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) గతంలో ప్రధానితో పాటు గాంధీ కుటుంబ సభ్యులకు ఉండేది. మొత్తంగా నలుగురికి ఈ గ్రూప్ భద్రత కల్పించేంది. కానీ గాంధీ కుటుంబ సభ్యులకు ఎస్పీజీని ఉపసంహరించి సీఆర్పీఎఫ్ భద్రతా కల్పిస్తున్నారు. అయితే రక్షణ మంత్రి, హోంశాఖ మంత్రికి ఇలాంటి సెక్యూరిటీ ఉందని అంటున్నారు. కానీ క్లారిటీ లేదు. అయితే దేశంలో ఎంతో మందికి ఎస్పీజీ, సీఆర్పీఎప్ భద్రత కల్పిస్తున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అన్నారు. అయితే హోంశాఖ మంత్రి సమాధానమిస్తూ ఎస్పీజీ భద్రత దేశం మొత్తం మీద కేవలం ప్రధానమంత్రికే ఉందన్నారు.
ప్రధాని వ్యక్తిగత భద్రత కోసం బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. కేవలం ఎస్పీజీ నిర్వహణకు ప్రతీ సంవత్సరం రూ.594 కోట్లు కేటాయిస్తున్నారు. ఒకప్పుడు ఎస్సీజీ భద్రత ఉండే నలుగురికి సమానంగా ఖర్చు చేసేది. కానీ చట్టంలో మార్పులు తెచ్చి మిగిలిన ముగ్గురికి ఎస్పీజీ భద్రత ఉపసంహరించుకోవడంతో మొత్తం 3 వేల మంది సిబ్బంది ప్రధానికే సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అంటే కేవలం ప్రధాన మంత్రి భద్రత కోసం గంటకు రూ.6.75 లక్షలను కేటాయిస్తున్నారు. అంటే రోజుకు రూ.1.62 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నమాట.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ను 1985లో స్థాపించారు. ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి వారి కుటుంబ సభ్యులకు అత్యంత పటిష్టమైన రక్షణను కల్పించాలని నిర్ణయించారు. 1984లో భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగిన తరువాత 1985లో ఎస్పీజీ పూర్తిగా అమల్లోకి వచ్చింది. ప్రధాని బయటికి వెళ్లినప్పుడు ఎస్పీజీ భిన్నమైన సెక్యూరిటీ కల్పిస్తారు. ర్యాలీ కోసం వెళ్లినప్పుడు ఒకలాగా.. సమావేశాలకు వెళ్లినప్పుడు మరోలాగా సెక్యూరిటీని కల్పిస్తారు. ఇవి కాకుండా మరేదైనా ఇతర కార్యక్రమాలకు వెళితే వాటికోసం మరో రకమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. ప్రతీ అడుగులో ఆయనకు భద్రత ఉంటుంది. ఏ పర్యటనకు ముందైనా అక్కడికి వెళ్లి ఎస్పీజీ రెక్కీ నిర్వహిస్తుంది. ఆ తరువాత కొన్ని ఎస్పీజీ బృందాలు అక్కడ మోహరిస్తాయి. రాష్ట్రానికి చెందిన భద్రతా ఏజెన్సీతో ఇంటెలిజెన్స్ బ్యూరో నిరంతర సంప్రదింపులు జరుపుతూనే ఉంటుంది.
అయితే ఎస్పీజీ ప్రధాని పర్యటనకు రూట్ క్లియర్ క్లియర్ చేస్తుంది. కానీ రాష్ట్రాల్లో పర్యటించినప్పుుడు మాత్రం అక్కడి హోంశాఖతో సంప్రదింపులుజరిపి భద్రత కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తారు. నిత్యం అప్రమత్తంగా ఉండే ఎస్పీజీ లో మొత్తం 3 వేల మంది సిబ్బంది ఉన్నారు. ప్రధాని పర్యటనను భట్టి వారు విభజన అవుతారు. ఇటీవల మోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా ఎస్పీజీ రూట్ క్లియర్ అయిన తరువాత ఆయన పర్యటన మొదలు పెట్టారు. అయితే స్థానిక పోలీసులు భద్రతా కల్పించడంలో విఫలం చెందారని ఆయన పర్యటనను రద్దు చేశారు. అందుకే ఎస్పీజీ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించి యాక్టివ్ గా ఉండేలా చూస్తారు.
-విచారించిన సుప్రీంకోర్టు
ఇక ప్రధాని మోడీ భద్రతలో లోపంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. పంజాబ్ లో ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన ప్రయాణ రికార్డులను భద్రపరచాలని.. పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.