కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తమిళ సీనియర్ నటి ఖుష్బూ అక్కడి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. చెన్నై నగరంలోని ‘థౌజెండ్ లైట్స్’ నియోజకవర్గం నుంచి పోటీకి రెడీ అయ్యారు. గురువారం ఏప్రిల్ 6న జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి ఆ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్ లో తన ఆస్తిని ప్రకటించారు. సుమారు 22.55 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు.
ధరపురం (రిజర్వు) నియోజకవర్గం నుండి బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్ మురుగన్ పోటీచేస్తున్నారు. ఆయన 1.53 కోట్ల రూపాయల విలువైన స్థిర, చర ఆస్తులను ప్రకటించారు. ఆయన భార్య డాక్టర్ సి కలయరాసి ఆస్తుల విలువ 1.09 కోట్ల రూపాయలుగా చూపించారు..
ఖుష్బు సినిమాల ద్వారా స్వయంగా సంపాదించిన స్థిరమైన ఆస్తులు 17.99 కోట్లుగా చూపించారు. ఇక ఆమె భర్త, ప్రముఖ సినీ నిర్మాత సుందర్ సి ఆస్తిని 16.57 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. ఇక ఖుష్బూ తనకు 3.45 కోట్లు, భర్తకు 5.55 కోట్ల అప్పులు ఉన్నాయని తన నామినేషన్ పత్రాలలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ప్రకటించారు. వీరిద్దరి స్థిరమైన ఆస్తులలో తమిళనాడులో ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో వ్యవసాయేతర భూములు ఉన్నాయి. కొన్ని ఫ్లాట్లు మరియు నివాస భవనాలు శివారు ప్రాంతాల్లో ఉన్నాయని చూపించారు.
కాంగ్రెస్‌తో తన ఆరేళ్ల అనుబంధాన్ని తెంచుకొని గతేడాది అక్టోబర్‌లో బిజెపిలో ఖుష్బు చేరింది. తెలంగాణతోపాటు ఊటిలో నివాస భవనాలు ఉన్నాయని చూపించారు. ఇక ఖుష్బూపై మొత్తం నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.