ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం గురించి చర్చ సాగుతోంది. ఈ సినిమా సంచలన విజయం సాధించి భారీ వసూళ్ల దిశగా దూసుకువెళుతోంది. యువతరం సహా అన్ని వర్గాల ఆడియెన్ లోనూ దీనిపై చర్చ ఉంది. కానీ భారతీయ సువార్తికుడు శాంతి సృష్టికర్తగా పాపులరైన KA పాల్ RRR గురించి తాను వినలేదని వ్యాఖ్యానించారు.
పాల్ ఈరోజు సోషల్ మీడియా వేదికగా లైవ్ సెషన్ చేస్తుండగా అనేక మంది ఫాలోవర్స్ రకరకాల ప్రశ్నలు అడిగారు. రాజ్‌మౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం RRR చూశారా? అని ఒక వ్యక్తి కె.ఏ.పాల్ ని అడిగాడు. పాల్ వెంటనే ``ప్రతిరోజూ ఒక కొత్త సినిమా వస్తుంది. ఇవన్నీ ఎవరు గుర్తుంచుకుంటారు? RRR గురించి ఎప్పుడూ వినలేదు`` అన్నారు.
యూత్ ని ప్రశ్నిస్తూ.. "మీకు వేరే పని లేదా? మీరు విడుదలైన ప్రతి సినిమా చూస్తారా? సమాజంలో మార్పు కోసం కృషి చేయండి" అని కూడా పాల్ ప్రబోధించాడు. ఉపయోగకరమైన దాని కోసం పని చేయండి. నిర్మాణాత్మకంగా ఉండండి. ఈసారి రాజకీయాలను ఆరోగ్యవంతంగా కుల వివక్ష రహితంగా మార్చేందుకు మనమందరం కష్టపడాలి అని ఆయన అన్నారు. RRR గురించి ప్రశ్నలు అడగడంపై క్లాస్ తీసుకున్నారు పాల్.
ఎవరో సినిమా తీస్తారు. మీరు వాటిని గమనిస్తే.. ఇది పూర్తిగా సమయం వృథా. మీరు దాని నుండి మంచి ఏమీ పొందలేరు. లేదా కనీసం అర్థవంతమైన సినిమాలైనా చూడండి. నేను RRR గురించి ఎప్పుడూ వినలేదు. అదేమిటో నాకు తెలియదు. తెలుగు మేకర్స్ ప్రతి వారం రెండు సినిమాలను విడుదల చేస్తున్నారు" అని వ్యంగ్యంగా నవ్వేశారు.
రాజకీయాలపై ప్రస్థావిస్తూ.. ఇక్కడ కులరహిత రాజకీయాలు కావాలని కోరారు. ఏప్రిల్ 9 లోపు తాను భారతదేశానికి వస్తానని చెప్పారు. అయితే ఇలా పబ్లిక్ వేదికపై ఆయన ఆర్.ఆర్.ఆర్ ని తక్కువ చేసి చూపినందుకు నెటిజన్లు అతనిపై ఫైర్ అయ్యారు. RGV నుంచి కౌంటర్ వచ్చింది. "నీ మొహమ్ ..." అనే ట్వీట్ చేశారు.
అయితే కేఏ పాల్ తాను ఏం చెప్పినా నిజాయితీగా చెప్పేందుకు చాలాసార్లు ప్రయత్నించారు. కానీ దానిని కామన్ జనం రకరకాలుగా డైవర్ట్ చేశారు. కొందరు లైట్ తీస్కున్నా చాలామంది సోషల్ మీడియాల్లో ఘాటైన కామెంట్లతో విరుచుకు పడే సందర్భాలున్నాయి.