వైద్యో నారాయణ హరి..! వైద్యులను దేవుళ్లుగా కొలిచే దేశం మనది. కానీ కొందరు మాత్రం వైద్యాన్ని వ్యాపారం చేశారు. ప్రజలను జలగల్లా పీల్చుకుతుంటూ ... అడ్డగోలుగా ఫీజులు తీసుకుంటూ కార్పొరేట్ ఆస్పత్రి అంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నైతే రోగిని పట్టించుకొనేవాళ్లే ఉండరు. ఇదిలా ఉంటే తాజాగా ఇందుకు భిన్నమైన ఓ ఘటన రష్యాలో చోటుచేసుకున్నది.
ఓ వైపు ఆస్పత్రిలో మంటలు చెలరేగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఎవరైనా .. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోతారు. కానీ అక్కడి డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి ఓ రోగిని కాపాడారు. ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. దీంతో సదరు డాక్టర్లకు ప్రశంసలు దక్కుతున్నాయి.
రష్యాలోని బ్లాగోవెష్ చెన్స్క్ లో గల టీ సారిస్ట్-ఎరా అనే ఓ హాస్పిటల్లో ఓ రోగికి ఓపెన్ హార్ట్ సర్జరీ సాగుతోంది. ఇటువంటి టైంలో ఆస్పత్రి మంటల్లో చిక్కుకున్నది. ఈ విషయం ఆ సర్జరీ చేస్తున్న వైద్యులు, సిబ్బంది చెవిలో కూడా పడింది. కానీ వాళ్లు మాత్రం నిర్భయంగా తమ విధిని నిర్వర్తించారు. చివరకు సక్సెస్ ఫుల్ గా సర్జరీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్ గా మారాయి.
జార్ ల కాలంలో ఈ ఆస్పత్రిని కట్టించారు. దాదాపు 1907 వ సంవత్సరంలో ఈ ఆస్పత్రి కట్టారు. అయితే ఇక్కడ మంటలు అంటుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే స్పందించింది. సర్జరీ సాగుతున్న ఐసీయూ గదికి మంటలు వ్యాపించకుండా ముందు వాళ్లు రక్షణ చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాలా వేగంగా, చాకచక్యంగా మంటలు ఆపారు. అయితే అప్పటికీ ఆస్పత్రిలో 128 మంది ఉన్నట్టు సమాచారం. వారందరినీ సురక్షితంగా బయటపడేశారు. వైద్యుల తెగువను, అగ్రిమాపక సిబ్బంది ప్రతిభను అక్కడి ప్రభుత్వం కొనియాడింది.