అదిరేటి డ్యాన్సులతో అదరగొట్టిన కరోనా బాధితులు!

Update: 2020-08-23 12:30 GMT
దేశంలో కరోనా బారిన పడుతున్న సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే వ్యాధితో వేలాది మంది చనిపోయారు. అయితే కరోనా వచ్చిన వారంతా ఏమీ చనిపోరు. మొదటి నుంచి కరోనా అంటే దానిని ఓ బూచి లాగే చూపిస్తున్నారు. కరోనా బారిన పడ్డవారు పక్కన ఉంటే అంత దూరానికి పరిగెడుతున్నారు.దీంతో కరోనా అంటే జనాల్లో ఒకరమైన భయం నెలకొంది. వ్యాధి తీవ్రత ఎక్కువ లేకున్నా ఒత్తిడితో చనిపోయేవారు అధికమయ్యారు.

గుండె పోటు - మధుమేహం - ఆస్తమా తదితర సమస్యలు ఉన్నవారు కరోనా వస్తే ఒత్తిడి భరించలేక ఇది వరకు తమకున్న అనారోగ్య సమస్యలు అధికమై ప్రాణాలు విడుస్తున్నారు. ఇటువంటి వారి కోసం వైద్యులు ఇటీవల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యాధిగ్రస్తుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఆట, పాటలు నిర్వహిస్తున్నారు. వాళ్లు ఉత్సాహంగా గడిపేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరణాల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా పాడేరు కోవిడ్ సెంటర్ లో వైద్య సిబ్బంది కరోనా రోగులను ఉల్లాస పరిచే కార్యక్రమాలు నిర్వహించారు. హుషారైన పాటలకు స్టెప్పులు వేయించి వారిని సంతోష పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలతో బాధితులు ఒత్తిడికి దూరమై తొందరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. కరోనా బారిన పడ్డవారిపై వివక్ష చూపకుండా ధైర్యం చెబితే వారు తొందరగా కోలుకుంటారని సూచిస్తున్నారు.


Full View


Tags:    

Similar News